నెల్లూరులోని రంగనాయకపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికర్ దేవస్థానంలో శ్రీ వేదాంత దేశికుల వారి తిరునక్షత్ర మహోత్సవాల్లో భాగంగా శ్రీ వేదాంత దేశికులవారిని గజవాహనంపై ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని ఆచార్యులవారి ఆశీస్సులను అందుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు విజయసారథి భట్టర్, కేసి వరదరాజన్, కళ్యాణ్ బాలాజీ, రంగరాజన్, రాజగోపాల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
