నెల్లూరు నగరంలోని శ్రీ గురువాయురప్పన్ దేవస్థానంలో ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి మంగళవారం గోదాదేవి శ్రీ రంగనాథ స్వామివారికి సమర్పించిన కూడారై వెళ్లి విశేష పాశురాన్ని పురస్కరించుకుని ఆండాళ్ అమ్మవారికి క్షీరాన్నంను 108 గిన్నెలలో సమర్పించారు. ఏలూరు గంగా లాల పాయసాన్ని నివేదన చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు అద్దంకి నరసింహాచార్యులు స్వామివారి వైభవాన్ని గోదా దేవి భక్తి పారవశ్యాన్ని భక్తులకు వివరించారు. ఆలయ కార్యదర్శి కత్తుల వెంకట రత్నం కోశాధికారి గడ్డం రత్నయ్య కత్తి మోహన్ రావు బొగ్గుల మురళి మోహన్ రెడ్డి పలువురు సభ్యులు ఉత్సవం విజయవంతం కావడానికి కృషి చేశారు.