న్యూయార్క్‌లోని పొమానాలో ఉన్న శ్రీరంగనాధ స్వామి దేవాలయంలో శ్రీ నృసింహ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామికి విశేష కార్యక్రమాలను నిర్వహించారు. నూతన స్వర్ణకిరీటాన్ని ఈ సందర్భంగా ధరింపజేశారు. నృసింహ అవతార ఆవిర్భావ విశేషములను ఈ సందర్భంగా శ్రీ కృష్ణదేశిక జీయర్ స్వామి భక్తులకు వివరించారు.
