విషసర్పం…గరుడదండకం
తిరువహీంద్రపురంలో కవితార్కిక సింహులు శ్రీ వేదాంత దేశికుల వారు నివసిస్తున్నప్పుడు దేశికులవారిపై ఉన్న అసూయతో దేశికులవారిని హతమార్చాలని ఒకరోజు ముష్కరుడు ఒకరు విషసర్పాన్ని దేశికులవారిపై విసిరాడు. ఆ పాము కాటు వేయడానికి ముందుకు వస్తుంటే. దేశికుల వారు భయపడకుండా ఆ పాము చుట్టూ ఓ గీతను గీశారు. ఆ పాము ఆ గీతను దాటి రాలేకపోయింది. అదే సమయంలో దేశికులవారు గరుడదండకం పఠించారు. గరుత్మంతుడు వేగంగా వచ్చి పామును ఎగరేసుకుపోయారు. దీంతో పాదాల్లో నలిగిపోతున్న పామును చూసి ఆ పాము లేకపోతే తన జీవనోపాధి పోతుందని, ఆ పామును వదలివేయాల్సిందిగా ఆ ముష్కరుడు దేశికులపాదాలపై పడి క్షమించమని ప్రార్థించారు. దాంతో ఆ పామును వదలి వేయాల్సిందిగా దేశికులవారు ప్రార్థించడంతో గరుత్మంతుడు ఆ పామును విడిచిపెడుతారు.
గరుడ దండకం అనేది శ్రీమద్ వేదాంత దేశికులవారిచే స్వరపరచబడిన గొప్ప ప్రార్థనగా పేరు పొందింది. విష్ణువు యొక్క అగ్రగామి భక్తులలో ఒకరైన గరుడను కీర్తిస్తుంది. ఈ గరుడ దండకాన్ని పఠించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు. సుదూర ప్రయాణాన్ని ప్రారంభించే ముందు గరుడ దండకం జపిస్తే గరుడ భగవానుడు భక్తుడిని కాపాడి రక్షిస్తాడని నమ్ముతారు. అలాగే మనలోని ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని ఈ స్తోత్రం పఠించడం వల్ల పెరుగుతుంది. శత్రువులను మరియు దుష్ట ప్రత్యర్థులను నాశనం చేస్తుంది. పాములు మరియు ఇతర సరీసృపాల భయం లేకుండా ఉండవచ్చు. అలాగే గరుదదండకం పఠించడం వల్ల మనం ఆందోళన లేకుండా మనస్సు ప్రశాంతంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. అలాగే ఇది సర్ప దోషాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది