Paramparaa – The Tradition Continues…

శ్రీజయంతి ( జన్మాష్టమి) తిరువారాధనం

శ్రీజయంతి ( జన్మాష్టమి) తిరువారాధనం

శ్రీజయంతి ( జన్మాష్టమి) తిరువారాధనం ` నియమములు

మునిత్రయ సంప్రదాయం:

1. శ్రీ జయంతి రోజు పూర్తిగా ఉపవాసము ఉండవలెను. ఉపవాసం ఉండలేనిపక్షంలో రాత్రి తిరువారాధనం చేయు వరకు ఉపవాసముండి, తిరువారాధనము చేసిన తరువాత స్వామికి సమర్పించిన నైవేద్యం, చేసిన వెన్న, పాలు, మొదలగునవి స్వీకరించవచ్చును. ఇది కూడా సాధ్యం కానివారు పగటి పూట ఏకాదశి వలే పలహార వ్రతం చేయవచ్చును. ఎటువంటి కారణము చేతను అన్న ప్రసాదము స్వీకరించకూడదు. 

2. వ్రతనియమము అన్ని పాటించవలెను.  (గంధం, తాంబూలం, శిఖాలంకారము చేయకూడదు)

3. వ్రతానికి కావలసిన సంకల్పము చేసుకొనవలెను,

4. సాయంత్రపూట గృహమును శుభ్రపరచి ముగ్గులు మరియు చిన్ని కృష్ణుని పాదములు వేయవలెను,

5. రాత్రి శ్రీమద్భాగవతంలోని శ్రీ కృష్ణావతార ఘట్టమును పారాయణం చేయవలెను.

6. అట్లు కానిచో  వేరు ఏదైనా శ్రీ కృష్ణ స్తోత్రము పారాయణం చేయవచ్చును.

7. రాత్రి శ్రీజయంతి సందర్భంగా స్నానమాచరించవలెను.

8. మడి వస్త్రము ధరించి ద్వాదశ ఊర్ధ్వపుండ్రములు ధరించవలెను.

9. రాత్రి పూట వృషభ లగ్న మందు తిరువారాధనము చేయవలెను. ఇదే శ్రీ కృష్ణస్వామి జన్మించిన లగ్నం

10. తిరువారాధనం చేసి స్వామి తీర్ధం తీసుకుని ఇంటిలోని అందరికి ఇవ్వవలెను.

11. రాత్రిపూట జాగరణ చేయుట విశేషము.

12. మరుసటి రోజు ప్రొద్దున విశేష తిరువారాధనం చేసి  శ్రీ పాద తీర్ధం తీసుకొనవచ్చును.

13. ఆచార్య పాదుకారాధనం శుభప్రదం

14. శ్రీజయంతిరోజు ఉపవాసం ఉండి. తరువాతిరోజు పారణ చేయడం విశేషం.

15. విశేష తిరువారాధనం, కధళీపంచకం అనగా అరటి పండు, అరటికాయ, అరిటాకు, అరటి పువ్వు అరటి బొంత వాడవచ్చును. వాడుకలో ఇది ద్వాదశి నాడు నిషిద్ధం.

16. ఏది ఎమైనప్పటికి చింతపండు నిషిద్దం.

                           శ్రీమత్‌ అహోబిలమఠం :

 ఆవణి నెల కృష్ణ పక్ష – అష్టమి రోహిణి చేరిన దినం శ్రీ జయన్తి. ఒక ఘడియ కూడా దోషం ఉండరాదు.     అలారానిచో  మరుసటి రోజు నవమి శుద్ధమైన దినము, రోహిణి ఉండాలి.  అదియూ లేనిచో మృగశీర్ష నక్షత్రముతో కూడిన నవమి లేక దశమిరోజు శ్రీ జయన్తి.  

  పారాయణం, స్నానం వృషభ లగ్న మందు తిరువారాధనము  చేయవలెను.

విశేష వ్రతం, అర్ఘ్యం లేదు. రాత్రి పూట పారణ చేయాలి. ప్రసాదం, పప్పు పాయసం, భక్షణములు మొదలగునవి నివేదించవలెను.

                             తిరువారాధనం

1. తిరువారాధనం సంకల్పమందు కృతంచ…. శ్రీజయంతి పుణ్యకాలే  శ్రీ కృష్ణారాధనాఖ్యేన భగవతః కర్మణ  భగవంతం వాసుదేవం అర్చయిష్యామి అని చెప్పవలెను.

2. మంత్రాసనమునందు

 లోకనాథస్య కృష్ణస్య జయన్తీ సముపాగతా

సంభృతాశ్చైవ సంభారాః కల్పితాని ఆసనాన్యపి

  అని చెప్పవలెను.

3. విశేషముగా పచ్చి పాలతో అభిషేకం చేయవలెను

4. అలంకారాసనము నందు  ధూపం, దీపం, సమర్పించిన తరువాత విశేషమైన అర్ఘ్యం ఒకటి సమర్పించ వలెను.

విశేష అర్ఘ్యం : – 1 – మూల మంత్రముతో ప్రాణాయామం .

2. సంకల్పం : శ్రీ కృష్ణ జయన్తీ ఉత్సవార్థం అర్ఘ్యం కరిష్యే 

3. ఒక శంఖములో కొబ్బరినీరు నింపి అర్ఘ్యం ఇవ్వవలెను..  శంఖము లేనిచో ఒక ఆకుతో సమర్పించవలెను.

4. శంఖమును మూల మంత్రముతో ప్రోక్షణం చేయవలెను.

5. శంఖం అగ్రభాగమందు  చంద్రం ఆవాహయామి అని చంద్రుని ఆవాహనం చేయవలెను,

   శంఖము చివర  జనార్దనం ఆవాహయామి అని  పెరుమాళ్ళను ఆవాహనం చేయవలెను.

6. ఈ శంఖమునందు కొబ్బరి నీరు చేర్చి  అందులో గంధం, పుష్పం అలంకరించవలెను.

 7. మోకాళ్ళ మీద కూర్చోని   చంద్రునికి, శ్రీ కృష్ణ భగవానునికి అర్ఘ్యం సమర్పించవలెను.

8. చంద్రునికి అర్ఘ్యం. మంత్రం:

క్షీరోదార్ణవ సంభూత అత్రి నేత్ర సముద్భవ  గృహాణార్ఘ్యం మయాదత్తం రోహిణ్యా సహితః శశిన్‌

తరువాత చంద్రునికి ఉపస్థానం చేయవలెను. లేచి నిలబడి చేతులు జోడిరచి స్తోత్రం చేయవలెను.

మంత్రం : – జ్యోత్స్నా పతే  నమస్తుభ్యం నమస్తే జ్యోతి షాం పతే!

            నమస్తే రోహిణీ కాన్త సుధా కుంభ నమోస్తుతే !!      

తరువాత శంఖము లో శుద్ధమైన నీరు  నింపి  గంధం, పుష్పము అలంకరించి మోకాళ్ళ మీద కూర్చోని  శ్రీ కృష్ణ భగవానునికి అర్ఘ్యం సమర్పించవలెను.

 మంత్రం:

 జాత: కంస వదార్థాయ భూభారోద్ధరణాయచ !

దానవానాం వినాశాయ దైత్యానాం నిధనాయచ!

పాండవానాం హితార్థాయ ధర్మస్థాపనాయచ !

యాదవానాం చ రక్షణార్ధం వసుదేవ కులోద్భవ !

గృహాణార్ఘ్యం మయాదత్తం దేవక్యా సహితో హరే !!

5. తరువాత మంత్ర పుష్పం విశేష అర్చన, స్తోత్ర పారాయణం చేయవలెను.

6. భోజ్యాసనము నందు అన్నివిధములైన భక్ష్యములను, పెరుగు వెన్న  నివేదించవలెను.

7. పునర్‌ మంత్రాసనము నందు పండ్లు తాంబూలం సమర్పించవలెను

8. విశేషమైన దీపహారతి, శాత్తుమొరై చేసి తిరువారాధనం ముగించవలెను.

9. మరుసటి రోజు విశేషమైన తిరువారాధనం చేయవలెను. స్వామికి విశేషమైన వంటకాలను సమర్పించవలెను.

                                 శుభం

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour