Paramparaa – The Tradition Continues…

శ్రీ కృష్ణదేశిక జీయర్‌స్వామివారి శ్రీమద్రామాయణ ఉపన్యాసం

న్యూయార్క్‌లోని పొమనాలో ఉన్న శ్రీ కృష్ణ దేశిక జీయర్‌ స్వామివారిచే శ్రీమద్రామాయణ ఉపన్యాస కార్యక్రమాలను ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహిస్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10.30 (ఇఎస్‌టి), భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ఈ ప్రవచనాలను వినవచ్చు. శ్రీకృష్ణ ఆశ్రమం వారు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగవతులంతా పాల్గొని జీయర్‌స్వామివారు చెప్పే శ్రీరాముని దివ్యచరితమును వినవల్సిందిగా కోరుతున్నారు. బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ, ఉత్తరకాండములను ఈ ప్రవచనాల్లో వివరించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన లింక్‌ తదితర వివరాలకోసం ఈ ఫ్లయర్‌ను చూడవచ్చు.