అహోబిలమఠం యుఎస్‌ఎ ఆధ్వర్యంలో అధ్యయనోత్సవాలను టెక్సాస్‌లోని శ్రీ గురువాయూరప్పన్ దేవాలయంలో డిసెంబర్ 22 నుంచి 31వ తేదీ వరకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నవనీత కృష్ణునికి వివిధ అలంకరణలు చేసి పూజా కార్యక్రమాలు చేశారు. గరుడవాహనంపై ఉన్న శ్రీకృష్ణుడిని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఈ సందర్భంగా ప్రబంధ పండితులు ఆళ్వారులు అనుగ్రహించిన నాలాయిర దివ్య ప్రబంధాన్ని సేవించారు. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఈ ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.
