మనలో చాలా మందికి తిరుమల వెళ్ళినప్పుడు లభించేది కేవలం ఒక్క సెకను దర్శనమే ! ఎవరో కొందరు అదృష్ట వంతులు మాత్రం బ్రేక్ దర్శనం లో వెళ్తారు…అయితే చాలా మంది అనుకుంటారు అసలు ఈ సెకను టైం లో ఆ స్వామి నా కష్టాలు విన్నాడా అని…స్వామి కి నా కష్టాలు చెప్పుకునే టైం దొరకలేదు అని బాధ పడతాముం…ఒక్క విషయం గుర్తుంచుకోండి…స్వామి వారిని మనం ఎంత సేపు చూసాము అన్నది కాదు ప్రశ్న…స్వామి మనల్ని చూసాడా లేదా అన్నదే ముఖ్యం…
మీరు కొండపై అడుగు పెట్టగానే మిమ్మల్ని స్వామి చూసినట్లే…అసలు అంత దాకా ఎందుకు…మనం ఇంట్లో వున్నా స్వామి మనల్ని తప్పక చూస్తాడు… మనకు ఎది కావాలో స్వామి వారికి తెలీదా చెప్పండి ? ఏదో మన అమాయకత్వం గానీ …మనకు ఏది కావాలో స్వామి కి తెలిసినట్లు ఎవ్వరికీ తెలీదు…మీరు ఒక్క సెకను దర్శనం చేసుకున్న మీ కోరిక నెరవేరుతుంది….
మనం ధర్మం ప్రకారం జీవిస్తున్నట్లు అయితే మనకు వచ్చిన కష్టం స్వామి తప్పక తీరుస్తాడు… వి. ఐ.పి. లు కొన్ని నిమిషాలు స్వామి ని దర్శించు కుంటారు కదా వాళ్లకి స్వామి కి విన్నవించుకోవ డానికి బోలెడంత టైం ఉంటుంది అనుకోకండి… అలా అయితే ఈ దేశం లో ప్రతీ రాజకీయ నాయకుడూ ముఖ్య మంత్రులు , ప్రధాన మంత్రులు అవ్వాల్సిందే…అలాగే స్వామిని వి.ఐ.పి.బ్రేక్ లో దర్శించుకునే అత్యంత ధనవంతులకి ఏ కష్టం రాకూడదు… అలా జరగటల్లేదు కదా…ఎన్నో సార్లు బ్రహ్మాండమైన ఆలయ మర్యాదలతో స్వామిని దర్శించుకున్న వారికి కూడా కష్టాలు రావడం చూస్తూనే ఉన్నాము కదా…
కాబట్టి తిరుమల ఎప్పుడు వెళ్ళినా ఇలాంటి ఆలోచన పెట్టుకోవద్దు…మీరు ధర్మపథం గా జీవిస్తూ ఏదైనా కష్టం వచ్చినప్పుడు స్వామిని ఆర్తితో కొలిస్తే స్వామి మిమ్మల్ని తప్పక అనుగ్రహిస్తాడు…కొందరు అంటుంటారు…మేము ఎంతో ధర్మం గా ఉంటున్నాము…స్వామిని నిత్యం కొలుస్తాము…అయినా ఇన్ని కష్టాలు మాకు ఎందుకు వచ్చాయి…అని నన్ను అడుగుతుంటారు…మనం ఈ జన్మలో ఎంతో ధర్మం గా ఉంటున్నాము…సరే…కానీ పూర్వ జన్మల్లో చాలా పాపాల
చేసి వుండవచ్చు కదా…అందువల్ల వాటి ఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాము…
ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి…మనం భగవంతుడిని సాధారణం గా ఏమి కోరుకుంటాము?…స్వామీ ఇంకా ఈ జన్మకి ఈ కష్టం పడలేక పోతున్నాను…అని… అలా అనగానే స్వామి వారు ఆ కష్టాన్ని మరో జన్మకి తోసేస్తారు…ఇప్పుడు మీరు పడుతున్న కష్టం అటువంటిదే కావచ్చును…అందుకే మనం ఎంత ప్రార్థించిన ఆ కష్టం ఒకంతట పోదు… ఇది ఏదో పూర్వ జన్మలో మనం వద్దు అని ఆ స్వామి వారిని అడిగిందే… ఆ కష్టం తట్టుకునే శక్తిని ఇవ్వమని స్వామి వారిని ప్రార్ధించడమే మనం చెయ్య వలసిన పని…ఆ ఆశ్రితజన రక్షకుడు మనకు ఆ కష్టం తట్టుకునే శక్తి తప్పక ఇస్తాడు…
ఆ ఆపదమొక్కుల వాడు , అనాధరక్షకుడు , ఆర్ట్రజన పరాయణుడు , తిరు వేంకట నాథుడు మనల్ని అందరినీ చల్లగా చూడుగాక !
శ్రీ లక్ష్మి శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు
సర్వే జనా సుఖినోభవంతు
సమస్త కల్యాణానిభవంతు
Viswapathi
(TVRK Murthy)
pH.9849443752