Paramparaa – The Tradition Continues…

క్యాలెండర్‌ కథ

మనిషి ప్రతి రోజు క్యాలెండర్‌ చూడకుండా ఉండలేదు. మనిషి జీవితాన్ని సరైన దిశకు మార్చడంలో కూడా క్యాలెండర్‌ ఓ పాత్రను పోషిస్తోంది.  తేదీ కోసమో, వారంకోసమో, తిథికోసమో, నక్షత్రం కోసమో రోజుకొక్కసారైనా క్యాలెండర్‌వైపు చూడని వాళ్ళు ఉండరు. ప్రసుత్తం మనమంతా వాడే క్యాలెండర్‌ను ఈజిప్టువారు తయారుచేశారు. క్రీస్తుపూర్వం 6వేల సంవత్సరాల క్రితమే కాలాన్ని కొలిచే ప్రయత్నం మొదలుపెట్టారు. చంద్రుని గమనాన్ని బట్టి నెలకు 30 రోజులని నిర్దారణకు వచ్చారు. తరువాత రుతుచక్ర క్రమాన్ని బట్టి సూర్యోదయ స్థానచలనాన్ని బట్టి సంవత్సరానికి 360 రోజులను పేర్కొన్నది ఈజిప్టువాళ్ళే. ఆతరువాత దానిని 365 ¼ గా సర్దుబాటు చేసింది కూడా వారే. ఏడాదికి 12 నెలలని అంటూ, దీనిపై పరిశోధన చేశారు. బాబిలోనియాలో జరిగిన పరిశోధన చాలా విశిష్టమైనది. సూర్యుడు నడిచే దారిలో ఉన్న ప్రధాన నక్షత్రాలను 12 రాశులుగా విభజించిన ఘనత వీరిదే. మకర, వృషభ, సింహ, మేష…ఇవన్నీ వాళ్ళు పెట్టిన పేర్లే! సోమ, మంగళ, బుధ వారాల పేర్లూ బాబిలోనియన్ల పుణ్యమే.

క్యాలెండర్‌ నిర్మాణంలో గ్రీకులు కీలకపాత్ర పోషించారు. శాస్త్రీయ పరిశోధన ఇక్కడ నుంచే ప్రారంభమైంది. రుతుచక్రం పంచాగానికి ప్రాణం. సౌరసంవత్సరం దాన్ని నిర్దేశిస్తుంది. మరి, చంద్రుని పాత్ర ఏమిటీ అని భావించే గ్రీకు నిపుణులు చాంద్ర,సౌర పంచాంగాన్ని తయారు చేశారు. ఆ కాలంలోనే దాదాపు వందకుపైగా క్యాలెండర్లు వచ్చాయంట. అందులో ఏథెన్స్‌ క్యాలెండర్‌ బాగా ప్రాచుర్యాన్ని పొందిందని హిస్టరీ చెబుతోంది. లాటిన్‌లో క్యాలెర్‌ అంటే పిలుపు. నెలలో మొదటిరోజు క్యాలెండ్‌. అప్పుల చిట్టాలు రాసుకునే పుస్తకం క్యాలెండర్‌. మామూలుగా పద్దులన్నీ ఒకటవ తేదీనే రాసుకునేవారు. ఆ పుస్తకమే క్రమక్రమంగా క్యాలెండర్‌గా మారింది. తొలుత క్యాలెండర్‌ గందరగోళంగా ఉండటంతో జూలియస్‌ సీజర్‌ అధికారంలోకి వచ్చిన తరువాత దీనిని సరిచేసే బాధ్యతను ‘సొసి జెనిస్‌’ అనే గ్రీక్‌ ఖగోళ విద్వాంసుడికి అప్పగించారు. ఆయనే క్యాలెండర్‌ను మనం నేడు చూసేవిధంగా సంస్కరించారు. సోసి జెనిస్‌ ఏడాదికి 365 రోజులని ఖరారు చేశారు. మరి మిగిలిన పావు దినాన్ని నాలుగేళ్ళకోసారి లీవు సంవత్సరంతో దాన్ని సర్దుబాటు చేస్తున్నారు.1582లో గ్రిగోరియస్‌ క్యాలెండర్‌ అమలులోకి వచ్చింది.

ఋగ్వేదంలో కూడా క్యాలెండర్‌లాంటి ప్రస్తావన మనకు కనిపిస్తుంది. పన్నెండు ఆకుల చక్రం ఆకాశంలో తిరుగుతోంది. ఏడువందల ఇరవై మంది పిల్లలు జంటలుజంటలుగా అందులో ఉన్నారు. 12 నక్షత్రాల రాశుల చక్రం. 720 మంది పిల్లలు జంటలు జంటలుగా ఉండటమంటే 360 పగళ్ళు. 360 రాత్రుళ్ళు. ఏడాదికి 360 రోజులని  ఆనాడే కనిపెట్టారు.

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour