Paramparaa – The Tradition Continues…

నవంబర్‌ 2 నుంచి 11వ తేదీ వరకు తిరుపతి శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద ఉన్న శ్రీ వేదాంత దేశికులవారి ఆలయంలో నవంబర్‌ 2 నుంచి 11వ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. నవంబర్‌ 2వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు ప్రబంధ పారాయణ కార్యక్రమంతో ఉత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. నాలుగువేల దివ్య ప్రబంధాలను ఈ ఉత్సవాల్లో పారాయణం చేయనున్నారు. 11వ తేదీన శాత్తుమొరై కార్యక్రమం జరుగుతుంది. ఆరోజు ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై దేశికులవారి దేవాలయానికి వేంచేస్తారు. ఆరోజు ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారితోపాటు శ్రీ వేదాంత దేశికులవారికి తిరుమంజనసేవ, ఇతర కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఉత్సవానికి అందరూ హాజరుకావాలని శ్రీ వేదాంత దేశికుల ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. శ్రీమాన్‌ ఉ.వే. కంభరాజపురం శ్రీ శేషాద్రి అయ్యంగార్‌ స్వామి శిష్యులు ఈ ఉత్సవాల్లో ప్రబంధపారాయణం చేయనున్నారు.

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour