కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఘంటావతార రూపమైన కవితార్కిక సింహ శ్రీ వేదాంతదేశికర్ 753వ తిరునక్షత్ర మహోత్సవాలను నెల్లూరులోని రంగనాయకపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికర్ దేవస్థానంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 15 శుక్రవారం ఉదయం శ్రీ వేదాంత దేశికులవారి తిరునక్షత్రాన్ని పురస్కరించుకుని దేశికులవారిని బంగారు పల్లకీపై ఊరేగించారు. స్వామివారి పల్లకీ సేవను భక్తులంతా తిలకించి పులకరించిపోయారు.