Paramparaa – The Tradition Continues…

నెల్లూరులో 22 నుంచి ఆదివణ్‌ శఠగోప స్వామి, శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు

నెల్లూరులో 22 నుంచి ఆదివణ్‌ శఠగోప స్వామి, శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో శ్రీమద్‌ ఆదివణ్‌ శఠగోప యతీర్రదునికి, శ్రీ వేదాంత దేశికులవారికి ఘనంగా ఉత్సవాలను నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సెప్టెంబర్‌ 22 నుంచి 30వ తేదీ వరకు శ్రీమద్‌ ఆదివణ్‌ శఠగోప స్వామికి ఆస్థాన ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ఉభయకర్తలుగా ఖతార్‌లో ఉంటున్న శ్రీమాన్‌ నారాయణన్‌, శ్రీమతి ఇందిర, శ్రీరంగనాధగోష్టి సభ్యులు, శ్రీమాన్‌ పప్పు మధుసూధన్‌ వ్యవహరిస్తున్నారు.
సెప్టెంబర్‌ 26వ తేదీ సోమవారం సాయంత్రం 4.30 గంటలకు శ్రీ వేదాంత దేశికులవారికి హంసవాహన ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్‌ కడాంబి సంపత్‌ గోపాలన్‌ వ్యవహరిస్తున్నారు.
సెప్టెంబర్‌ 27వ తేదీ మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు సింహవాహనంపై శ్రీ దేశికులవారిని ఊరేగించనున్నారు. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్‌ కడాంబి క్రిష్ణస్వామి కుటుంబం వారు ఉన్నారు.
సెప్టెంబర్‌ 28వ తేదీ బుధవారంనాడు యాళివాహనంపై దేశికులవారు కనువిందు చేయనున్నారు. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్‌ కిడాంబి వేణుగోపాల్‌, శ్రీమాన్‌ రాజగోపాలన్‌, శ్రీమాన్‌ డా. అల్లాడి మోహన్‌, శ్రీమాన్‌ ఎ. విద్యాసాగర్‌, శ్రీమాన్‌ ధర్మవరం మధు, శ్రీమాన్‌ సుందర్‌ రాఘవన్‌ వ్యవహరిస్తున్నారు.
సెప్టెంబర్‌ 29వ తేదీ గురువారంనాడు ఉదయం 8 గంటలకు నాచ్చియార్‌ తిరుక్కోలం ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్‌ ఉ.వే. వి.ఎస్‌. రాఘవన్‌ స్వామి స్మారకార్థం వారి కుటుంబ సభ్యులు, శ్రీమాన్‌ వెంకట రాఘవన్‌ (హైదరాబాద్‌), శ్రీమాన్‌ కోదండ రామన్‌ (ఖతార్‌) ఉన్నారు.
అదేరోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ వేదాంతదేశికులవారికి, శ్రీ ఆదివణ్‌ శఠగోప యతీంద్ర మహాదేశికన్‌ స్వామికి ఊంజలసేవ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా శ్రీమాన్‌ ఇష్టి వి.కె. చారి, శ్రీమాన్‌ ఇష్టి శ్రీహరి, శ్రీమాన్‌ విష్ణుమోహన్‌, శ్రీమాన్‌ శ్రీరామ్‌, శ్రీమతి స్వాతి, శ్రీమతి కడాంబి లలిత వ్యవహరిస్తున్నారు.
30వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి గరుడసేవ జరుగుతుంది. శ్రీ వేదాంత దేశికులవారికి, శ్రీమద్‌ ఆదివణ్‌ శఠకోప యతీంద్ర మహాదేశికన్‌ స్వామివార్లకు తిరుచ్చి ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవానికి శ్రీమాన్‌ కొమండూరు శ్రవణకుమార్‌ ఉభయకర్తలుగా ఉన్నారు.
అక్టోబర్‌ 1వ తేదీ శనివారం ఉదయం 6 గంటలకు శ్రీమద్‌ ఆదివణ్‌ శఠగోపయతీంద్ర మహాదేశికులవారి తిరునక్షత్ర మహోత్సవములు, పల్లకి సేవ జరుగుతుంది. ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంజన సేవ ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి, శ్రీమద్‌ ఆదివణ్‌ శఠగోప యతీంద్ర మహాదేశికులకు పేట ఉత్సవం, శాత్తుమొఱై జరుగుతుంది. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్‌ నేలటూరు వంగీపురం బాలాజీ, ట్రస్టీ, అహోబిలమఠం శిష్యులు వ్యవహరిస్తున్నారు.
అక్టోబర్‌ 2వ తేదీ ఆదివారం సాయంత్రం 4.30 నిముషాలకు శ్రీ వేదాంత దేశికులవారికి చంద్రప్రభ వాహనం జరుగుతుంది. ఉభయకర్తలుగా శ్రీమతి సరోజ, శ్రీమాన్‌ రంగస్వామి (మధురై) వ్యవహరిస్తున్నారు.
అక్టోబర్‌ 3వ తేదీ సాయంత్రం 4.30 నిముషాలకు శ్రీ వేదాంత దేశికులవారికి గజవాహన సేవ జరుగుతుంది. శ్రీమాన్‌ రాచపూడి వెంకట సుబ్బారావు, లలితమ్మ స్మారకార్థం రాచపూడి సూర్యనారాయణరావు, శ్రీమాన్‌ రాచపూడి మనోహర్‌ రావు ఉభయకర్తలుగా ఉన్నారు.
అక్టోబర్‌ 4వ తేదీ సాయంత్రం 4.30 నిముషాలకు శ్రీ వేదాంత దేశికులవారికి అశ్వవాహన సేవ జరుగుతుంది. శ్రీమాన్‌ బందేపల్లి రాజగోపాలన్‌ (ట్రస్టీ) ఉభయదార్లుగా ఉన్నారు.
అక్టోబర్‌ 5వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటలకు శ్రీ వేదాంత దేశికులవారి తిరునక్షత్రమును పురస్కరించుకుని పల్లకి సేవ, ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంజనం జరుగుతుంది.
శ్రీమాన్‌ ఉ.వే. నడాదూర్‌ కృష్ణమాచారి వారి కుటుంబం ఉభయకర్తలుఱబవ
సాయంత్రం 4 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి, శ్రీ వేదాంతదేశికులవారికి పేట ఉత్సవం, శాత్తుమొఱై జరుగుతుంది.
శ్రీమాన్‌ ఉ.వే. నడాదూర్‌ శ్రీనివాస రాఘవన్‌ ఉభయకర్తగా వ్యవహరిస్తున్నారు.
పందిరి, తిరువీధి దీపాలంకరణ, ఆస్థాన ఉత్సవం, తిరుమంజనం, అర్చకపరిచారిక, అలంకార సంభావన, ప్రబంధ, వేదపారాయణ గోష్టి సంభావనను సిడ్నీ ఆండాళ్‌ గ్రూపు (ఎస్‌ఎజిఐ) సభ్యులు, రంగనాధ గోష్టి సభ్యులు ఇస్తున్నారు. ఈ ఉత్సవాలను మేనెజింగ్‌ ట్రస్టీ శ్రీమాన్‌ కడాంబి వరదరాజన్‌ (జన), ట్రస్టీలు శ్రీమాన్‌ నేలటూరు వంగీపురం బాలాజీ, శ్రీమాన్‌ కడాంబి రామదొరై, శ్రీమాన్‌ వరదరాజన్‌ రమేష్‌, శ్రీమాన్‌ బండేపల్లి రాజగోపాలన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour