నెల్లూరు నగరం రంగనాయకులపేట లో వేంచేసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా పగల్పత్తు రాపత్తు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శనివారం పదవరోజు రాపత్తు ఉత్సవం సందర్భంగా నమ్మాళ్వార్ కు మోక్ష ప్రాప్తి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. దేవస్థాన అర్చకులు కిడాంబి శ్రీరామ్ ,కిడాంబి సంపత్ నారాయణ, కిడాంబి రామానుజాచార్యులు, సుదర్శనాచార్యుల, ప్రధాన తీర్థ కార్లు తిరుమల వింజమూరు నరసింహాచార్యులు ,పలువురు శ్రీ వైష్ణవ స్వాములు భక్త బృందం ఘనంగా స్వామివారిని సేవించారు.