కావలసినవి
పాలు – 2 లీటర్లు, పంచదార – అర కప్పు, చెరోలి పప్పు – 2 టేబుల్ స్పూన్లు, బాదంపప్పు – 2 టేబుల్ స్పూన్లు (సన్నగా ముక్కలుగా కోయాలి), యాలకుల పొడి – టీ స్పూన్, మిల్క్ మెయిడ్ – డబ్బా.
తయారుచేసే విధానం :
పాలను చిక్కగా కోవాలా అయ్యే వరకూ మరిగించాలి. అందులో పంచదార, మిల్క్‌మెయిడ్ కలిపి సిమ్‌లో పెట్టి మరి పదిహేను నిమిషాలు మరిగించి దింపాలి. బాదం, చెరోలి, యాలకుల పొడి వేసి కలిపి చల్లారిన తరువాత ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లచల్లగా ఉన్న బాసుందీని పిల్లలూ, పెద్దలూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు.
చిట్కా
బాసుందీ తయారు చేసేటప్పుడు మరుగుతున్న పాలలోనే కొద్దిగా పంచదార వేసి తిప్పుతూంటే పాలు త్వరగా అడుగంటకుండా ఉంటాయి.