తర్పణము చేసిన తరువాత మనము స్నానమాచరించిన తడివస్త్రమును మూడు మడతలుగా చేసు కొనవలెను. ఆచమనం , ప్రాణాయామం , సంకల్పం … శ్రీ భగవదాజ్ఞయా … వస్త్ర నిష్పీడనం కరిష్యే అని సంకల్పించుకొని, తడివస్త్రమును మూడు మడతలుగా చేసుకొని యజ్ఞోపవీతమును మాలగా వేసుకొని పితృ తీర్థముతో మూడు సార్లు వదలవలెను.
యేకే చాస్మ త్ కులే జాతా అపుత్రా గోత్రజా మృతా : l
తే గృణ్హన్తు మయాదత్తం వస్త్ర నిష్పీడనోదకంl