మహా తపస్సంపున్నుడు అయిన శ్రీ అగస్త్య మహర్షుల వారు దక్షిణ భారతానికి వచ్చినప్పుడు అనేక పరమేశ్వర లింగాలను ప్రతిష్టింప చేశారు…మనం గోదావరీ నదీ తీర ప్రాంతాలలో అనేక చోట్ల అగస్త్యుల వారు ప్రతిష్టించిన అనేక శివా లయాలను చూడవచ్చును.
అలా అగస్త్య మహర్షుల వారు చంద్రగిరి ప్రాంతానికి వచ్చి అక్కడ పక్కనే వున్న తిరుమల కొండల పవిత్రతకు , ప్రకృతి సంపదకు ఎంతో ఆశ్చర్య పడి అక్కడే దగ్గరలోనే ఆశ్రమం నిర్మించుకుని ఉండాలని నిర్ణయించుకున్నారు…అదే నేటి అగస్త్యాశ్రమం…ఈ ఆశ్రమం ఒకప్పుడు తిరుమల కొండలను ఆనుకుని అక్కడి దాకా విస్తరించి ఉండేది…ఆశ్రమం నిర్మించుకుని ఉందామనుకుని అగస్త్య మహర్షి చక్కటి నీటి వనరు కోసం పరమేశ్వరుని కోసం తపస్సు చేశాడు…అగస్త్య మహర్షి తపస్సు కు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షం అయి ఆగస్త్యుల వారి కోరిక మేరకు సువర్ణముఖి నదిని సృష్టించాడు… ఆలా సువర్ణముఖి తిరుమల కొండలను ఆనుకుని బంగారు కాంతులతో మెరిసి పోతూ ఆవర్భ వించింది.ఆ నది తేజస్సుని చూసి మహర్షితో పాటు ఎందరో మునులు ఎంతో సంతోషించారు…
అయితే లక్షల సంవత్సరాల పాటు తిరుమల కొండల పైనుంచి పెద్ద పెద్ద శిలలు కిందకి పడటంతో ఈ నది కొండ నుంచి అయిదు కిలోమీటర్ల దూరం వచ్చింది…
ఎంతో అద్భుతంగా సువర్ణముఖి వుత్సహమ్ గా , వురకలు వేస్తూ పరుగెడుతూ ఉంటే ఆ శబ్దం అగస్త్య మహర్షి తపస్సు కి భంగం కలిగించింది…అక్కడితో మహర్షి కేవలం వర్షా కాలం లో బాహ్యంగా ప్రవహిస్తూ మిగిలిన సమయం లో అంతర్వాహిని గా ఉండమని ఆజ్ఞాపించాడు…అందుకే సువర్ణముఖి లో కేవలం వర్ష కాలం లోనే నీరు ను చూస్తాము…ఇలా శ్రీవారి పాదాల చెంత పుట్టిన సువర్ణముఖి అనేక ఉపనదులను కలుపుకుంటూ బంగాళాఖాతం లో కలుస్తుంది.సాక్షాత్తూ పరమేశ్వరుని అనుగ్రహంతో ఆవిర్భవించిన నది కాబట్టి సువర్ణ ముఖి ప్రవహిస్తున్న తీరం వెంబడి అనేక పుణ్య క్షేత్రాలు వెలిశాయి. అలా ఈ దివ్య నదీ తీరాన వెలిసిందే శ్రీకాళహస్తి పుణ్య క్షేత్రం….
ఒకప్పుడు తిరుపతి కి మంచి నీరు ఈ సువర్ణముఖి నుంచే తీసుకునే వారు.
అసలు తిరుమల కొండలు అన్నీ బంగారు మయమే…సత్య , త్రేతా యుగాలలో వేంకటాద్రి మొత్తం బంగారు మయమే…అందుకే వేంకటాద్రి కి కనకాద్రి అనే పేరు కూడా ఉంది. అయితే కలియుగం లో వేంకటాద్రి గా వ్యవహరింపబడుతూ సామాన్య శిలా రూపం లో మనకి కనిపిస్తున్నది. ఇప్పటికే శేషాచల కొండల లోపల బంగారం నిక్షిప్తమై ఉందని భూగర్భ శాస్త్రవేత్తల నమ్మకం…మీరు గమనిస్తే సాయంత్రం వేళల్లో ఎండ పడుతున్నప్పుడు తిరుమల కొండలు బంగారు కాంతులతో మెరుస్తూ ఉంటాయి.
పురాణాలలో శ్రీ వేంకటేశ్వరుని ఆవిర్భావం గురించి చెప్పేటప్పుడు సువర్ణ ముఖీ నదికి ఫలానా వైపున శ్రీమన్నారాయణుడు ఈ వేంకటాద్రి పై శ్రీ వెంకటేశ్వరునిగా వెలిశాడు అని చెప్పబడుతుంది.
శ్రీ లక్ష్మి శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు
సర్వేజనా సుఖినోభవంతు
Viswapathi
(TVRK Murthy)
www.lordofsevenhills.com
E-Mail : [email protected]
pH.9849443752