Paramparaa – The Tradition Continues…

అట్టముక్కలతో అద్భుత ప్రతిమలు నరసింహన్‌ సొంతం…

నెల్లూరు రంగనాయకులపేటకు చెందిన కె నరసింహన్‌ అట్టముక్కలతో అద్భుతమైన దైవ ప్రతిమలను రూపొందించి అనేకమంది ప్రశంసలను అందుకున్నారు. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ సొంతం చేసుకున్నారు. చిన్నతనం నుంచి చిత్రలేఖలో మంచి ప్రావీణ్యం ఉన్న నరసింహన్‌ ఆ కళను అట్టముక్కలపై చూపించి కళాఖండాలను రూపొందిస్తూ వస్తున్నారు. వృత్తిపరంగా పాతపుస్తకాల దుకాణాన్ని నిర్వహిస్తున్న నరసింహన్‌ అట్టముక్కలతో ఎన్నో వస్తువులను తయారు చేశారు. దైవభక్తి మెండుగా ఉన్న నరసింహన్‌ స్వామివారికి ఉపయోగించే అనేక వస్తువులను అట్టముక్కలతో తయారు చేశారు. మొదట ఆయన శ్రీ వేంకటేశ్వరస్వామి వజ్రకిరీటాన్ని రూపొందించారు. స్వామివారి వజ్రాభరణాలైన తిరునామ, శంఖం, చక్రం, కర్ణపత్రాలను కూడా ఆయన అట్టముక్కలతో చక్కగా తయారు చేసి ప్రదర్శించారు. బ్రహోత్సవాల్లో స్వామి వారి నిజమైన ఆభరణాలను చూడలేని భక్తులు ఈ ఆభరణాలను చూసి తరించే విధంగా వీటిని ఆయన తయారుచేశారు.
శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల సమయంలో రామానుజుల విగ్రహాన్ని 30కేజీల అట్టను వినియోగించి బంగారు విగ్రహంలా రూపొందించారు. వేదాంత దేశికర్ల 750వ తిరునక్షత్ర ఉత్సవాల్లో శ్రీవారి సుదర్శన చక్రాన్ని 20 కేజీల అట్టతో తయారు చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి పాదుకలను 30 కిలోల అట్టముక్కలతో తయారు చేశారు. ఆయన అద్భుత ప్రతిభను ఎంతోమంది ప్రశంసిస్తూ వస్తున్నారు. శ్రీ వేదాంత దేశికులవారికి సేవ చేసుకునే భాగ్యం కలగడం, ఇలాంటి ప్రతిమలను తయారు చేసే అవకాశం లభించడం స్వామివారి కరుణకటాక్షాల వల్లనే లభించిందని ఆయన చెబుతున్నారు.

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour