ఆయుమ్ అరిందవర్ ఆళ్వార్ అంటే లోతు తెలిసినవాడని అర్థం. అనగా పరమాత్ముని పట్ల భక్తి ప్రపత్తుల ద్వారా పుణ్యఫలాన్ని పొందినప్పుడు కలిగే పరమానందమనే సాగరపులోతు తెలిసినవాడని అర్థం. ఆళ్వార్ల భక్తి స్వచ్ఛమైనది. తమ దివ్యచరిత్రల ద్వారా, పాశురముల ద్వారా వీరు భక్తి ప్రపత్తుల ద్వారా ఫుణ్యఫలాన్ని పొందినప్పుడు కలిగే పరమానందమనే సాగరపులోతు తెలిసినవాడని అర్థం. ఆళ్వార్ల భక్తి స్వచ్ఛమైనది. తమ దివ్యచరిత్రల ద్వారా పాశురముల ద్వారా వీరు భక్తిభావానికి పునాది వేశారు. ఆళ్వార్ల భక్తిమార్గానికి శ్రీ రామానుజాచార్యులు ఆధ్యాత్మిక వారసులుగా ఉన్నారు. ఆళ్వారులు కులమతాల పట్టింపులకు పోకుండా సర్వమానవ సమానత్వాన్ని ఆకాంక్షించి మోక్షసాధన అనేది అన్ని కులాలవారికి ఉందని నిరూపించారు. ఈ ఆళ్వార్లలో వివిధ కులాలకు చెందిన వారు ఉన్నారు. వీరిలో ఒకరు స్త్రీ, ఒకరు పంచమకులజులు, శూద్రులు, బ్రాహ్మణులు, క్షత్రియులు ఉన్నారు. ఆళ్వారులు పాడిన పాశురములు ఇయర్పా, ముదలాయిరమ్, పెరియతిరుమొళి, తిరువాయ్‌మొళి అనే పేరిట నాలాయిర దివ్యప్రబంధాలుగా పేరు పొందాయి. నిజానికి వీరు భక్తితాద్యాత్మంతో పాడిన ఈ పాశురాలు ఆనాటి ప్రజల్లో దేవదేవునిపట్ల భక్తిభావాన్ని పెంపొందింపజేశాయి. వీరు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరునిలో శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, భక్తప్రహ్లాదుడు అనుగ్రహించిన నరసింహస్వామిని దర్శించి కీర్తించారు. గొప్ప దార్శనికులైన ఆళ్వార్ల పాశురములలో భక్తిభావంతోపాటు కవితా సౌందర్యం కూడా ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. తిరుమల కొండల ప్రకృతి రమణీయకత కన్నులకు కట్టినట్లు వారు తమ పాశురాల్లో వర్ణించారు.
అడుగడుగుకు దండాలు పెడుతూ కొండకొమ్మున ఉన్న కోనేటిరాయుని దర్శనానికై అసేతు హిమాచలం నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తూనే ఉన్నారు. స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. శ్రీనివాసునికి అనునిత్యం కళ్యాణమే, ప్రతినిత్యం ఉత్సవమే అని చెబుతారు.
ఆళ్వారులు శ్రీ వేంకటేశ్వరుని కీర్తిస్తు పాడిన పాశురాల వివరాలను ఆళ్వార్ల మధురకవితలో తిరుమలేశుని వైభవంలో తెలుసుకుందాం.
` టి. రఘుకుమార్