మనలో చాలా మందికి శ్రీనివాస మంగాపురం అన్నా అలమేలు మంగాపురం అన్నా ఒకటే అని తెలీదు…ఇంకా కొందరు భక్తులు అయితే తిరుచానూరుని అలమేలు మంగాపురం అని కూడా పిలుస్తారు.అసలు విషయం ఏమిటంటే ఇప్పటి శ్రీనివాస మంగాపురం లో ఒకప్పుడు ఎన్నో దేవతల ఆలయాలు ఉండేవి.వాటిలో అలమేలు మంగమ్మ ఆలయం కూడా ఒకటి.అయితే ముష్కరుల దాడిలో ఈ శ్రీనివాస మంగాపురం ఎంతో ధ్వంసమయింది…అలమేలు మంగమ్మ ఆలయం లోని విగ్రహాన్ని , నగలను దుండగులు ఎత్తుకు పోయారు.
అయితే శ్రీనివాసుని విగ్రహం చూసి భయపడి ఏమీ చెయ్యకుండా వెళ్ళిపోయారు.అక్కడితో మంగమ్మ లేని ఆలయం కావడంతో అలమేలు మంగాపురం కాస్తా శ్రీనివాస మంగాపురం అయ్యింది.
అయితే ఒకప్పుడు శ్రీనివాస మంగాపురం ఒక వెలుగు వెలిగింది.తిరుమల కు వెళ్ళడం కష్టంగా ఉండే ఆ రోజుల్లో చాలా మంది యాత్రికులు స్వామి వారిని ఇక్కడే దర్శించుకుని వెళ్ళేవారు.1433 సంవత్సరం లోనే ఇక్కడ 24 మంది వేద పారాయణదార్లు ఉండే వారంటే ఈ ఆలయం ఎంత వైభవం గా వుండేదో అర్థం అవుతుంది…అంతే కాదు తిరుమల బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు కొండపై నిర్వహించి తర్వాత తొమ్మిది రోజులూ ఇక్కడ నిర్వహించేవారు…ఆ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరిగేవి.
అసలు శ్రీనివాస మంగాపురం గ్రామాన్ని సిద్ధవటం అని పిలిచేవారు …ముందు ఈ పేరే ఉండేది…తర్వాత కాలం లో శ్రీనివాసపురం , అలమేలుమంగాపురం , ప్రస్తుతం శ్రీనివాసమంగాపురం అయ్యింది…ఇక్కడ స్వామి కళ్యాణ వేంకటేశ్వరుడు…శ్రీనివాసుడు శ్రీ పద్మావతీ దేవిని వివాహం చేసుకుని కొండకు వెళ్తూ ఇక్కడ ఆరు నెలలు వుండటం తో స్వామి కళ్యాణ వేంకటేశ్వరుడి గా వెలుగొందుతున్నాడు.i కల్యాణీ నది ఒడ్డున కళ్యాణ వేంకటేశ్వరుడు వుండటం విశేషమే కదా మరి…ఇక్కడ కళ్యాణం జరిపించిన వారికి త్వరలోనే తప్పక వివాహం జరుగుతుంది.
Viswapathi
(TVRK Murthy)
www.lordofsevenhills.com
pH.9849443752