తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని వివిధ దేవాలయాల్లో పంచాంగ శ్రవణం, ఇతర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. తిరుచానూరులోని శ్రీ శ్రీనివాసస్వామి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో శ్రీమాన్ ఉ.వే. చక్రవర్తి రంగనాధన్ స్వామి పాల్గొని పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.
