న్యూయార్క్‌లోని పొమానాలో ఉన్న శ్రీరంగనాథ స్వామి దేవాలయంలో జూలై 1 నుంచి 10 రోజులపాటు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు.
జూలై 1వ తేదీన ఉదయం 10 గంటలకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సాయంత్రం 5 గంటలకు విష్వక్సేన ఆరాధనం, మృత్సంగ్రహణ రక్షా బంధన, అంకురార్పణ, శ్రీ గరుడ ఆధీవాసం, హోమం, వేదం, నాలాయిర దివ్యప్రబంధ పారాయణ తొడక్కం జరుగుతాయి.
జూలై 2వ తేదీన ఉదయం 10 గంటలకు ధ్వజారోహణం, గరుడ ప్రసాద వితరణ, 11 గంటలకు శేషవాహన సేవ, మహా కుంభ స్థాపన, మధ్యాహ్నం 3 గంటలకు భేరీతాదనం, దేవతాహ్వానం, హోమం, బలిహరణం, 5 గంటలకు చతుస్థాన ఆరాధన, సాయంత్రం 6 గజవాహన సేవ.
జూలై 3వ తేదీ ఉదయం 10 గంటలకు గరుడవాహన సేవ, సాయంత్రం హనుమంతవాహన సేవ
జూలై 4వ తేదీన ఉదయం 11 గంటలకు శ్రీరంగనాథ కళ్యాణోత్సవం సాయంత్రం 6 గంటలకు శ్రీ తిరుమంగై ఆళ్వార్ వేదుపూరి
జూలై 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఉదయం 10 గంటలకు, సాయంత్రం 5 గంటలకు చతుస్థాన అర్చన, హోమం, బలిహరణం, ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయి.
జూలై 9వ తేదీ ఉదయం 11 గంటలకు రథోత్సవం, సాయంత్రం 6 గంటలకు కల్పవృక్ష వాహనసేవ జరుగుతుంది.
జూలై 10వ తేదీన తీర్థవారి ` చక్రస్నానం, మధ్యాహ్నం 2 గంటలకు ద్వాదశ ఆరాధన, పుష్పయాగం, సప్తవరణం, మహాపూర్ణాహుతి, ధ్వజ అవరోహణ, కుంభ ప్రోక్షణ, శాత్తుమురై, అర్చక మర్యాద, ఉత్సవ ముగింపు మూకబలి జరుగుతుంది.