దొంగ నగవుల నాపవోయి, మా మదుల దోచే,ఓ మా దొంగ కృష్ణుడ,తిరు వేంకట కృష్ణుడ
//దొంగ//
దొంగ వోలే మా ఇండ్ల దూరి, వెదకి,వెదకి వెన్నల దొంగ లించి తిన మరిగి,దొర వోలే తిరుగాడ నేర్చిన ఓ,మా గోపల్లె దొంగ బాల కృష్ణుడ
//దొంగ//
దొంతర,దొంతరల గోప వనితల వలువల దొంగలిం పుల సేసి,చెట్టు మీద చేరి, చేతులెత్తి మ్రొక్కిన,తిరిగి ఇచ్చేననేటి,ఓ మా దొంగ బాల కృష్ణుడ
//దొంగ//
దొంగలింపుల సేయ మాని నట్టు,తిరు వేంకట గిరుల చేరి,తిరుమాడ వీధుల, ముద్దు సతులిద్దరి నడుమ, దొంగ నగవుల చిందించి,మా మదులదోయుచూ,తిరుగాడ జూచేటి,ఓ మా తిరు వేంకట కృష్ణుడ
//దొంగ//
సంకీర్తన సంఖ్య:–3197
శ్రీ వేంకటేశ్వరుని దివ్య ఆశీస్సులతో
వేంకట రామ విరచితం