Paramparaa – The Tradition Continues…

శ్రీనివాసుని చిరు మందహాసం

మనకి తిరుమల ఆనంద నిలయం లోని శ్రీనివాసుని నిశితంగా గా దర్శించే అదృష్టం దొరకదు గానీ ఆ స్వామి ఎంతో అందంగా ఉంటాడు…సృష్టి మొత్తం లోని అందం ఆ స్వామి లోనే ఉంది…అందుకే మనం అందరం ఆ స్వామి వైపు అంతగా ఆకర్షింప బడతాము…ఎప్పుడెప్పుడు వెళ్లి స్వామిని దర్శించు దామా అని మనస్సు ఒకటే కొట్టుకుంటుంది…

ఇక ఆ స్వామి చిరు నవ్వు అయితే వేయి నాలుకలు వున్న ఆ ఆదిశేషుడు కూడా వర్ణించలేని సౌందర్యం …స్వామి పెదవుల పై చిరునవ్వు ఈ సమస్త విశ్వానికి రక్షా కవచం…
సర్వ దేవతా గణమూ ఈ చిరు నవ్వుకు సమ్మోహితులై నిత్యం సామాన్య మానవుల రూపం లో వచ్చి స్వామి వారిని దర్శించి కుంటారుట…ఈ చిరునవ్వు కు సర్వ జీవ కోటి ఆకర్షింప బడుతుంది…ఒక్కసారి స్వామి వారి మోమును వూహించు కొండి…ఆహా ! ఎంత మనోహరం గా ఉంది స్వామీ నీ చిరునవ్వు …నా బాధలు అన్నీ ఈ క్షణం మర్చిపోయాను…ఆహా ! ఏమి అందం ! ఏమి అనురాగం ! ఏమి ఆప్యాయత…ఎంతటి ప్రేమ ! ఈ సమస్త జీవ కోటి పై తనకు గల అపార ప్రేమను స్వామి తన చిరు నవ్వు లోనే చూపిస్తాడు…

ఆహా ! ఆ కళ్యాణ కమనీయ చిరు నవ్వుతో మా కంట ఆనంద బాష్పాలు కారుతున్నాయి తండ్రీ !…ఈ చిరునువ్వు చాలు మమ్మల్ని సంసార సాగరం నుంచి ఆవల పడేయడానికి …

నిత్యం నీ హృదయం లో ఉండి తల పైకెత్తి నిత్యం నీ చిరునవ్వు చూసే శ్రీ మహాలక్ష్మీ ఎంత అదృష్టవంతురాలో …వేయి తలలు కిందకు వంచి నిత్యం నీ చిరునవ్వును ఆనందం గా దర్సిస్తున్న ఆ ఆదిశేషుని భాగ్యం వర్ణించ తరమా ?

ఆ చిరునవ్వు నుంచి ప్రసరించే చల్లటి కిరణాలు మా హృదయాలను ఆనందం లో ముంచెత్తుతున్నాయి స్వామీ !…మమ్మల్ని ఇంత ముగ్ధ మనోహర చిరు నవ్వుతో అలరిస్తున్న నీకు మేమేమీ ఇవ్వగలం తండ్రీ ? రెండు భక్తి కుసుమాలు తప్ప !
ఓ ఆపద్బాంధవా ! నీ కివే మా నమస్కారాలు… ఓ అనాధ రక్షకా ! నీకివే మా ప్రణామాలు.

శ్రీ లక్ష్మి శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు
సర్వే జనా సుఖినోభవంతు
సమస్త కళ్యాణాని భవంతు
సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు

Viswapathi
(TVRK Murthy)
www.lordofsevenhills.com
E-Mail : [email protected]
pH.9849443752

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour