Paramparaa – The Tradition Continues…

శ్రావణ పూర్ణిమ సమిధా దానము – 11-08-2022

కొత్తగా జంధ్యం ధరించిన వటువులు చేయాల్సిన సమిధా దానం…హోమం వివరాలు….

ముకాన్తం

శుద్ధిచేసిన స్థలములో  కర్త తూర్పు అభిముఖముగా కూర్చోని బియ్యం మీద సమిధ లేక దర్భలతో  తూర్పువైపుగా 3 గీతలు, తరువాత దక్షిణ ఉత్తర దిక్కుగా 3 గీతలు వేయవలెను.

దర్భలను  క్రింద ఉంచి, ప్రోక్షణ చేసి, ఉత్తరమువైపు వేయవలెను. అగ్ని గుండం ఉంచి పరిస్తరణము నాలుగు ప్రక్కల నాలుగేసి దర్భలు ఉంచవలెను (పరిస్తరణము). అగ్ని చేర్చి  అగ్ని వైపు చేతులు జోడిరచి ప్రార్థించవలెను.

పరిత్వాగ్నే  పరిమృజామి ఆయుషా  ధనేనచ సుప్రజా ప్రజయా భూయాసం. సువీరో  వీరైః సువర్చా,  వర్చసా సుపోషః పోషైః   సుగృహో గృహై స్సుపతిః  పత్యా సుమేధా  మేధయా   సుబ్రహ్మా బ్రహ్మచారిభిః

అగ్నికి పరిషేచనం`

 ఓం అదితే అనుమన్యస్వ  అనుమతే అనుమన్యస్వ  ఓం సరస్వతే   అనుమన్యస్వ 

అని కూర్చతో నీటిని తాకి మూడువైపులా  దక్షిణం నుంచి ఉత్తరానికి, పశ్చిమం నుంచి తూర్పు (హోమగుండానికి ఎడమవైపున) మళ్ళీ పశ్చిమం నుంచి తూర్పు (హోమగుండానికి కుడివైపున) గీతలు గీసేటప్పుడే పైన చెప్పిన మంత్రాన్ని చెప్పాలి.

దేవసవిత : ప్రసూవ అని హోమగుండం చుట్టూ ప్రోక్షణలాగా త్రిప్పాలి.

సమిధ/ రెండు రెండు  దర్భలు చేర్చి హోమం చేయాలి.

1. ఓం అగ్నయే  సమిధం ఆహారిషం  బృహతే జాతవేదసే యథాత్వమగ్నే

సమిధా  సమిధ్యస  ఏవం  మామ్‌  `ఆయుషా వర్చసా  సన్యా మేధయా   ప్రజయా పశుభి:

బ్రహ్మ వర్చసేన అన్నా ద్యేన  సమేధయ స్వాహా

2. ఏధోసి  ఏధిషీ మహి స్వాహ

3. సమిదసి సమేధిషీమహి స్వాహా

4. తేజోసి  తేజో   మయిధేహి  స్వాహ

 5. అపో అద్య, అన్వచారిషం రసేన, సమ  సృక్ష్మహి పయస్వాన్‌, అగ్న ఆగమంతం మాసం సృజ వర్చసా  స్వాహా

6. సమ్మాగ్నే వర్చసా  సృజ ప్రజయాచ  ధనేనచ   స్వాహా

7. విద్యున్మే అస్యదేవా ఇంద్రో విద్యాత్‌  సహ రిషిభి   స్వాహా

8. అగ్నయే బృహతే నాకాయ స్వాహా

9. ద్యావా పృథివీభ్యాగ్‌ స్వాహా

10 ఏషాతే  అగ్నేసమిత్తయా  వర్ధస్వచ ఆప్యాయ స్యచ తయాహం వర్ధమానో  భూయాసం  ఆప్యాయమానశ్చ  స్వాహా

11 యోమాగ్నే  భాగినగుం  సన్తం  అధాభాగం   చికీర్షతి  అభాగమగ్నే   తంకురు మామిగ్నే భాగినం కురు స్వాహా

12 సమిదం ఆధాయ అగ్నే సర్వ వ్రతో భాయాసం   స్వాహా

13 ఓ భూ స్వాహ

14 ఓం భువస్వాహ

15. ఓగుం సువస్వాహ

16. ఓం భూర్బువ స్సువ స్వాహ

అగ్నిపరిషేచనం ఓం అదితేఅన్వమగ్గుస్థా  దక్షిణం వైపు

ఓం అనుమతే అన్వమగ్దుస్థా పడమర వైపు

ఓం సరస్వతే అన్వమగ్గుస్థా  ఉత్తరం వైపు

దేవసవిత ప్రాసావీః 

అని ప్రదక్షిణముగా నీళ్లు ప్రోక్షణ చేయవలెను.

ఓం శ్రీవిష్ణవే స్వాహా అనిరెండు దర్భలను అగ్నిలో చేర్చవలెను.

శ్రీ విష్ణవే పరమాత్మన ఇదం నమమ.

లేచి నిలుచుకొని

యత్తే అగ్నే తేజస్తేనా   అహం తేజస్వీ భుయాసం

యత్తే అగ్నే   వర్చస్తేనా అహం వర్చస్వీ   భూయాసం

యత్తే అగ్నే హరస్తేనా అహం హరస్వీ  భూయాసం

మయిమేదాం  మయిప్రజాం మయ్యగ్ని:

 తేజో దధాతు మయిమేదాం  మయిప్రజాం మయీంద్ర  ఇంద్రియం దధాతు

మయిమేదాం మయిప్రజాం మయి సూర్యోభ్రాజో దధాతు

అగ్నయేనమః

మంత్ర హీనం క్రియా హీనం  భక్తిహీనం హుతాశన యద్దు తంతు  మయాదేవ  పరిపూర్ణం తదస్తుతే  ప్రాయశ్చిత్తాని అశేషాణిః తపః కర్మాత్మకానివై  యానితేషాం   అశేషాణాం కృష్ణ అనుస్మరణం పరం  శ్రీకృష్ణ కృష్ణ, కృష్ణ అని చెప్పి ప్రణమిల్లి అభివాదనం చేయవలెను.

ఆచమనం చేయవలెను.

సాత్విక త్యాగం  భగవానేవ…… సమిధాదానాఖ్యం………స్వస్మై స్వప్రీతయే స్వయమేవ కారితవాన్‌

 – కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్‌

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour