నృసింహస్వామి 32 స్వరూపాలు….
భక్తులకు విశ్వాసాన్నీ … శత్రువులకు భయాన్ని కలిగించడం కోసం శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారం శ్రీనరసింహస్వామి అవతారం. ప్రహ్లాదుడిని హిరణ్య కశిపుడు నుంచి కాపాడిన అవతారం శ్రీ నృసింహావతారం. అలా భూమిపై ఆవిర్భవించిన నరసింహ స్వామి, అనేక స్వరూపాలతో తన భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నాడు. లక్ష్మీ నరసింహస్వామి .. యోగానంద నరసింహస్వామి … జ్వాలా నరసింహస్వామి … ప్రహ్లాద సమేత నరసింహస్వామిగా ఆయన వివిధ క్షేత్రాల్లో దర్శనమిస్తూ ఉంటాడు. అలాంటి నరసింహస్వామి 32 స్వరూపాలని మంత్ర శాస్త్రం పేర్కొంటోంది. ఉజ్వల నరసింహుడు .. రుద్ర నరసింహుడు .. కరాళ నరసింహుడు .. రక్తాక్ష నరసింహుడు .. విశ్వాక్ష నరసింహుడు .. ధూమ్రకేశ నరసింహుడు .. మేఘనాథ నరసింహుడు .. తీవ్రతేజ నరసింహుడు .. విశ్వ భూషణ నరసింహుడు .. సుహాను నరసింహుడు .. కృష్ణ నరసింహుడు .. మహాఘోర నరసింహుడు .. శ్రుతాంతక నరసింహుడు .. వికరాళ నరసింహుడు .. పింగలాక్ష నరసింహుడు, మేఘవర్ణ నరసింహుడు .. విఘ్నక్రమ నరసింహుడు .. సుకోణ నరసింహుడు .. భీమ నరసింహుడు .. మహాసేన నరసింహుడు .. దైత్యాంతక నరసింహుడు .. మహోగ్ర నరసింహుడు .. కుంభకర్ణ నరసింహుడు .. అగ్నివర్ణ నరసింహుడు .. విశాల నరసింహుడు .. దీప్తతేజ నరసింహుడు .. మధుసూదన నరసింహుడు .. ఘనస్వన నరసింహుడు .. భీషణ నరసింహుడు .. అంజన నరసింహుడు .. హయగ్రీవ నరసింహుడుగా స్వామి మంత్ర శాస్త్రంలో ప్రస్తుతించినట్లు ఐతిహ్యం.