మహాలయ పక్ష తర్పణ క్రమం ( పితృు పక్షం)
మహాలయ పక్షం అనగా భాద్రపద కృష్ణ పక్ష ప్రథమ మొదలు కొని చతుర్దశి వరకు ఉన్న రోజులను మహాలయ పక్షం అంటారు . మన శ్రీ వైష్ణవ సంప్రదాయములో మహాలయ పక్షంలో ఒక రోజు మాత్రం తర్పణం చేయుట ఆచారముగా ఉన్నది. సాధారణముగా ఈ తర్పణమును మహాలయపక్షములో మహా భరణి, మద్యాష్టమి వ్యతి పాదము , లేక గజచ్చాయ మొదలగు దినములలో చేయుట విశేషము. లేక వారివారి మాతృ పితరుల తిధిలో చేయ వచ్చును.
గమనిక : మన బంధువులలో , పుత్ర భాగ్యములేక మరణించిన వారికి , వారికి సంక్రమణ తర్పణం ( అమావాస్య) లేదు . అటువంటి వారికి మహాలయ తర్పణమునందు వారి వారి గోత్రం పేర్లు బంధు వర్గం చెప్పి తర్పించ వలెను . లేని యెడల అందరికి కలిపి కారుణ్య పితృు తర్పణం చేయుట విశేషము. ఉll తండ్రి తరపున పెద్దనాన్న పెద్దమ్మ తల్లి తరపున అత్త,మేనమామ లకు పుత్ర భాగ్యము లేనిచో వారికి తర్పించ వలసిన విధము …. గోత్రస్య … శర్మణ : . మమ పితృవ్య పితు: …. స్వధానమస్తర్పయామి అని మూడు సార్లు తర్పించవలెను …. గోత్రా యా : ….. నా మ్ని మమ పితృు వ్యా …. స్వధానమస్తర్పయామి అని మూడుసార్లు తర్పించవలెను . లేని చో అందరికి కలిపి కారుణ్య పితృు స్వధానమస్తర్ప యామి .
1. కొందరు ఈ పక్షం రోజులు చేయుదురు దీనిని పక్ష మహాళయం అంటారు . 2. ముఖ్యమైన దినములలో పుణ్యదిన మహాళయం అంటారు. 3. ఒక రోజు చేయట సకృున్ మహాళయం అంటారు
ముఖ్యమైన దినములు
21.9 2024 శనివారం మహాభరణి
24.09.24 బుధవారము మహావ్యతిపాదం
25.09.24 గురువారం మధ్యాష్టమి
-Kambharajapuram Murali Iyengar, Tirupati