Paramparaa – The Tradition Continues…

శ్రీజయంతి ( జన్మాష్టమి) తిరువారాధనం

                             మునిత్రయ సంప్రదాయం:

1. శ్రీ జయంతి రోజు పూర్తిగా ఉపవాసము చేయవలెను.

2. అట్లు కానియెడల రాత్రి తిరువారాధనం చేయువరకు ఉపవాసముండి, తిరువారాధనము చేసిన తరువాత స్వామికి సమర్పించిన నైవేధ్యం చేసిన వెన్న, పాలు, మొదలగునవి స్వీకరించవచ్చును.

3. అదియు కానిచో  పగటిపూట ఏకాదశివలే పలహార వ్రతం చేయవచ్చును.

4. ఎటు వంటి కారణము చేతను అన్న ప్రసాదము స్వీకరించ కూడదు. మహా పాపము సంభవించును.

5. వ్రతనియమము అన్ని పాటించవలెను.  ( గంధం, తాంబూలం , శిఖాలంకారము చేయకూడదు)

6. వ్రతానికి కావలసిన సంకల్పము చేసుకొనవలెను,

7. సాయంత్రపూట గృహమును శుభ్రపరచి ముగ్గులు మరియు చిన్ని కృష్ణుని పాదములు వేయవలెను,

8 రాత్రి పూట శ్రీ మధ్భాగవతం లోని శ్రీ కృష్ణావతార ఘట్టమును పారాయణం చేయవలెను.

9. అట్లు కానిచో  వేరు ఏదైనా శ్రీ కృష్ణ స్త్రోత్రము పారాయుణం చేయవచ్చును.

10. రాత్రి శ్రీజయంతి సంధర్భంగా స్నానమాచరించ వలెను.

11. మడి వస్త్రము ధరించి ద్వాదశ  ఊర్ధ్వ పుండ్రం ధరించ వలెను.

12 – రాత్రి పూట వృషభ లగ్న మందు తిరువారాధనము చేయవలెను. ఇదే శ్రీ కృష్ణ స్వామి జన్మించిన లగ్నం

13. వృషభలగ్నం పంచ్చాంగ చూసి చేయవలెను.

14. తిరు వారాధనం చేసి స్వామి తీర్ధం తీసుకాని ఇంటిలోని అందరికి ఇవ్వవలెను.

15. రాత్రిపూట జాగరణ చేయుట విశేషము.

16. మరుసటి రోజు ప్రొద్దున విశేష తిరువారాధనం .  శ్రీ పాద తీర్ధం తీసుకొన వచ్చును.

17. ఆచార్య పాదుకారాధనం శుభప్రదం

18. పారణ నియమం విశేషం.

19. విశేష తిరువారాధనం కావున కధళీపంచకం అనగా అరటి పండు, అరటికాయ, అరిటాకు , అరటి పువ్వు అరటి బొంత వాడవచ్చును. వాడుకలో ఇది ద్వాదశి నాడు నిషిద్దం.

20. ఏది ఎమైనప్పటికి చింతపండు నిషిద్దం .

.                             తిరువారాధనం

1. తిరువారాధనం సంకల్ప మందు కృతంచ…. శ్రీజయంతి పుణ్యకాలే  శ్రీ కృష్ణా రాధనాక్యేన భగవత్ కర్మణా భగవంతం వాసుదేవం అర్చయిష్యామి అని చెప్పవలెను.

2. మంత్రాసనము నందు  లోకనాథస్య కృష్ణస్య జయన్తీ సముపాగతా అని చెప్పవలెను.

3. విశేషముగా గోక్షీరముతో  అభిషేకం చేయవలెను

4. అలంకారాసనము నందు  ధూపం, దీపం, సమర్పించిన తరువాత విశేషమైన అర్ఘ్యం ఒకటి సమర్పించ వలెను.

                              విశేష అర్ఘ్యం : –

1 – మూల మంత్రముతో ప్రాణాయామం .

2. సంకల్పం : శ్రీ కృష్ణ జయన్తీ ఉత్స వార్థం అర్ఘ్యం సమర్పయామి

3. ఒక శంఖములో కొబ్బరినీరు నింపి అర్ఘ్యం ఇవ్వవలెను..  శంఖము లేనిచో ఒక ఆకుతో సమర్పించ వలెను .

4. శంఖమును మూల మంత్రముతో ప్రోక్షణం చేయవలెను .

5. శంఖం అగ్రభాగమందు  చంద్రం ఆవాహయామి అని చంద్రుని ఆవాహనం చేయవలెను , శంఖము చివర జనార్ధనం ఆవాహయామి అని  పెరుమాళ్ళను ఆవాహనం చేయవలెను.

6. ఈ శంఖమునందు కొబ్బరి నీరు చేర్చి  అందులో   గంధం, పుష్పం అలంకరించ వలెను

7. మోకాళ్ళ మీద    కూర్చోని   చంద్రునికి, శ్రీ కృష్ణ భగవానునికి అర్ఘ్యం సమర్పించ వలెను 

8. చంద్రునికి అర్ఘ్యం . మంత్రం : – క్షీరోదార్ణవ సమ్బూత అత్రి నేత్ర సమద్భవ  గృహాణార్ఘ్యం మయాదత్తం రోహిణ్యా సహిత శశిన్

తరువాత చంద్రునికి ఉపస్థానం చేయ వలెను  లేచి నిలబడి చేతులు జోడించి స్త్రోత్రం చేయవలెను.   

మంత్రం : – జ్యోత్స్ననా పతే  నమస్తుభ్యం నమస్తే జ్యోతి షాం పతే!

నమస్తే రోహిణీ కాన్త సుధా కుంభ నమోస్తుతే |      

తరువాత శంఖము లో శుద్ధమైన నీరు  నింపి  గంధం, పుష్పము అలంకరించి మోకాళ్ళ మీద కూర్చోని  శ్రీ కృష్ణ భగవానునికి అర్ఘ్యం సమర్పించ వలెను.

 మంత్రం:

 జాత: కంస వదార్థాయ భూభారొద్దర ణాయచ !

దానవానాం వినాశాయ దైత్యానాం నిదనా యచ!

పాండవానాం హితార్థాయ ధర్మస్థా పనాయచ !

యాద వానాం చ రక్షణార్ధం వసుదేవ కులోద్భవ !

గృహాణార్ఘ్యం మయాదత్తం దేవ క్యా సహితో హరే !!

5. తరువాత మంత్ర పుష్పం విశేష అర్చన, స్తోత్ర పారాయణం చేయవలెను.

6 – భోజ్యాసనము నందు అన్నివిద ములైన భక్ష్యములను , పెరుగు వెన్న   నివేదించ వలెను .

7. పునర్ మంత్రాసనము నందు పండ్లు తాంబూలం సమర్పించ వలెను

8. విశేషమైన దీపహార్తి,  వివేషమైన శాత్తుమొఱ  చేయవలెను

9. ఇలాగా తిరువారాధనం ముగించ వలెను.

10. మరుసటి రోజు విశేషమైన తిరువారాధనం చేయవలెను. స్వామికి విశేషమైన తళిగై సమర్పించ వలెను.

                           శ్రీమత్ అహాబిలమఠం :

 ఆవణి నెల కృష్ణ పక్ష – అష్టమి రోహిణి చేరిన దినం శ్రీ జయన్తి . ఒక ఘడియ కూడా దోష ముండ రాదు .  అలారాని చో  మరుసటి రోజు నవమి శుద్ధమైన దినము, రోహిణి ఉండవలెను.  అదియూ లేనిచో మృగశీరిష నక్షత్రముతో కూడిన నవమి లేక దశమి  రోజు శ్రీ జయన్తి .  

  పారాయణం , స్నానం   వృషభ లగ్న మందు తిరువారాధనము   చేయవలెను.    విశేష వ్రతం, అర్ఘ్యం లేదు. రాత్రి పూట పారణ కావున అలంకార తళిగై ప్రసాదం, పప్పు పాయసం, భక్షణములు మొదలగునవి నివేదించవలెను.

                                              శుభం

                                         16. గోపాలవింశతిః

శ్రీమాన్ వేంకటనాథార్యః కవితార్కిక కేసరీ |

వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది ॥

వందే బృందావన చరం వల్లవీజన వల్లభమ్ ।

జయంతీ సంభవం ధామ వైజయంతీ విభూషణమ్ ॥ 1 ||

వాచం నిజాంక రసికాం ప్రసమీక్షమాణః

వక్తారవిందవినివేశితపాంచజన్యః |

వర్ణ త్రికోణ రుచిరే వరపుండరీకే

బద్ధాసనో జయతి వల్లవ చక్రవర్తీ ॥ 2 ॥

ఆమ్నాయ గంధ రుచిర స్ఫురితాధరోష్ఠం

ఆస్రా విలేక్షణమనుక్షణ మందహాసమ్ |

గోపాల డింభ వపుషం కుహనా జనన్యాః

ప్రాణస్తనంధయమవైమి పరం పుమాంసమ్ ॥ 3 ||

ఆవిర్భవత్వనిభృతాభరణం పురస్తాత్

ఆకుంచితైక చరణం నిభృతాన్యపాదమ్ ।

దధ్నా నిమంథ ముఖరేణ నిబద్ధతాలం

నాథస్య నంద భవనే నవనీత నాట్యమ్ || 4 |॥

హర్తుం కుంభే వినిహిత కరః స్వాదు హైయంగవీనం

దృష్ట్వా దామగ్రహణ చటులాం మాతరం జాతరోషామ్ |

పాయాదీషత్ప్రచలిత పదో నాపగచ్ఛన్నతిష్ఠన్

మిథ్యా గోపః సపది నయనే మీలయన్విశ్వగోప్తా ॥ 5 |

వ్రజయోషి దపాంగ వేధనీయం, మధురాభాగ్యమనన్య భోగ్యమీడే |

వసుదేవ వధూస్తనంధయం తత్కి, మపి బ్రహ్మ కిశోర భావదృశ్యమ్ ॥ 6॥

పరివర్తిత కంధరం భయేన, స్మిత ఫుల్లాధర పల్లవం స్మరామి ।

విటపిత్వ నిరాసకం కయోశ్చిద్విపులోలూఖల కర్షకం కుమారమ్ ॥ 7 ॥

నికటేషు నిశామయామి నిత్యం, నిగమాంతైరధునాపి మృగ్యమాణమ్ | యమలార్జున దృష్టబాల కేళం, యమునాసాక్షికయౌవనం యువానమ్ ||8||

పదవీమదవీయసీం విముక్తేః అటవీ సంపదమంబువాహయంతీమ్ |

అరుణాధర సాభిలాష వంశాం కరుణాం కారణమానుషీం భజామి ॥ 9

అనిమేష నిషేవణీయమక్ష్ణో: అజహద్యౌవనమావిరస్తు చిత్తే |

కలహాయిత కుంతలం కలాపైః, కరణోన్మాదక విభ్రమం మహో మే ॥ 10॥

అనుయాయి మనోజ్ఞ వంశనాళైః అవతు స్పర్శిత వల్లవీవిమోహైః ।

అనఘ స్మిత శీతలైరసౌ మామ్, అనుకమ్పాసరిదంబుజైరపాంగైః ॥ 11॥

అధరాహిత చారువంశనాళాః, మకుటాలంబి మయూర పింఛమాలాః ।

హరినీల శిలావిభంగనీలాః, ప్రతిభాస్సస్తు మమాంతిమప్రయాణే ॥ 12॥

అఖిలానవలోకయామి కాలాత్, మహిళాధీన భుజాంతరస్య యూనః | అభిలాషపదం ప్రజాంగనానామ్, అభిలాపక్రమ దూరమాభిరూప్యమ్ ॥ 13॥

హృది ముగ్ధ శిఖండమండనో లిఖితః, కేన మమైష శిల్పినా ।

మదనాతుర వల్లవాంగనా వదనాంభోజ దివాకరో యువా ॥ 14 ॥

మహసే మహితాయ మౌళినా, వినతేనాంజలి మంజనత్విషే ।

కలయామి విముగ్ధ వల్లవీ వలయాభాషిత మంజువేణవే ॥ 15॥

జయతి లలిత వృత్తిం శిక్షితో వల్లవీనాం

శిథిలవలయశింజా శీతలైర్ఘస్తతాలైః |

అఖిల భువన రక్షా గోపవేషస్య విష్ణోః

అధరమణిసుధాయామంశవాన్ వంశనాళః || 16 ||

చిత్రాకల్పః శ్రవసి కలయన్ లాంగలీ కర్ణపూరం

బర్హోత్తంస స్ఫురిత చికురో బంధుజీవం దధానః ।

గుంజా బద్దామురసి లలితాం ధారయన్ హార యష్టిం

గోపస్త్రీణాం జయతి కితవః కోఽపి కౌమారహారీ ॥ 17 ॥

లీలాయష్టిం కర కిసలయే దక్షిణే న్యస్య ధన్యామ్

అంసే దేవ్యాః పులకరుచిరే సన్నివిష్టాన్య బాహుః ।

మేఘశ్యామో జయతి లలితో మేఖలా దత్త వేణుః

గుంజాపీడ స్ఫురిత చికురో గోపకన్యా భుజంగః ॥ 18 ||

ప్రత్యాలీఢ స్థితిమధిగతాం ప్రాప్తగాఢాంకపాలిం

పశ్చాదీషన్మిలిత నయనాం ప్రేయసీం ప్రేక్షమాణః ।

భస్త్రా యంత్ర ప్రణిహిత కరో భక్త జీవాతురవ్యాత్

వారి క్రీడా నిబిడ వసనో వల్లవీ వల్లభో నః ॥ 19 ॥

వాసో హృత్వా దినకరసుతాసన్నిధౌ వల్లవీనాం

లీలాస్మేరో జయతి లలితామాస్థితః కుందశాఖామ్ ।

సవ్రీడాభిస్తదను వసనే తాభిరభ్యర్థ్యమానే

కామీ కశ్చిత్కర కమలయోరంజలిం యాచమానః ॥ 20 ॥

ఇత్యనన్య మనసా వినిర్మితాం, వేంకటేశ కవినా స్తుతిం పఠన్ |

దివ్య వేణు రసికం సమీక్షతే దైవతం కిమపి యౌవత ప్రియమ్ || 21 |

కవితార్కిక సింహాయ కళ్యాణగుణశాలినే ।

శ్రీమతే వేంకటేశాయ వేదాన్తగురవే నమః ॥

                           శ్రీకృష్ణ అనుగ్రహప్రాప్తిరస్తు

Kambharajapuram Murali Iyengar, Tirupati.

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour