Paramparaa – The Tradition Continues…

నెల్లూరులో ఘనంగా శ్రీ వేదాంతదేశికుల ఉత్సవాలు

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో శ్రీమద్ ఆదివణ్ శఠగోప యతీర్రద స్వామికి, శ్రీ వేదాంత దేశికులవారికి ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. సింహవాహనం, హంసవాహనం, యాళివాహనం, నాచ్చియార్ తిరుక్కోలంలో శ్రీ వేదాంతదేశికులవారిని ఎంతోమంది భక్తులు సేవించుకున్నారు. శనివారంనాడు శ్రీనివాసునికి గరుడసేవను వేదాంత దేశికులవారికి తిరుచ్చి వాహన సేవను నిర్వహించనున్నారు. 20వ తేదీన శ్రీ వేదాంత దేశికులవారికి చంద్రప్రభ వాహనం, 21న గజవాహన సేవ నిర్వహించనున్నారు.
22న శ్రీ వేదాంత దేశికులవారి అవతార దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఆరోజున పల్లకీ సేవ, స్నపన తిరుమంజనం, శ్రీ వేంకటేశ్వరస్వామివారికి శేషవాహనం, శ్రీ దేశికులవారికి తిరుచ్చి సేవ, 23న గంధప్పొడి ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు భక్తులందరూ హాజరుకావాలని ఆలయ ట్రస్టీలు శ్రీ కడాంబి వరదరాజన్, శ్రీ నేలటూరు బాలాజీ, శ్రీ కడాంబి రామదొరై, శ్రీ వరదరాజన్ రమేష్, శ్రీ బండేపల్లి రాజగోపాలన్ కోరారు.

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour