Paramparaa – The Tradition Continues…

నెల్లూరులో ఘనంగా ముగిసిన వేదాంతదేశికుల ఉత్సవాలు

నెల్లూరులోని రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంతదేశికుల ఆలయంలో 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించిన బ్రీVA్మత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. 22వ తేదీన జరిగిన దేశికులవారి అవతార దినోత్సవాన్ని పురస్కరించుకుని పల్లకీ సేవను వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామికి పవిత్ర పెన్నానది జలాలతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం వేంకటేశ్వరస్వామికి దేవేరులకు శేషవాహనంపైన, వేదాంత దేశికులవారిని తిరుచ్చిపై వేద మంత్రాలు మంగళ వాయిద్యాలతో పేట ఉత్సవం జరిపారు. రాత్రి దక్షిణ భారత వైష్ణవ క్షేత్రాల నుంచి ఆలయ మర్యాదలతో వేద శాత్తుమురై కార్యక్రమం జరిగింది. ట్రస్టీలు కె.సి. వరదరాజన్, నేలటూరు బాలాజీ, కడాంబి రామదొరై, వరదరాజ రమేశ్, బండేపల్లి రాజగోపాలన్ తదితరుల ఆధ్వర్యంలో ఈ బ్రీVA్మత్సవాలు వైభవంగా జరిగాయి.

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour