Paramparaa – The Tradition Continues…

నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన ఆదివణ్‌ శఠగోప యతీంద్రుల ఉత్సవాలు

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో అహోబిలమఠం వ్యవస్థాపకులు శ్రీమద్‌ ఆదివణ్‌ శఠగోప స్వామి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు సెప్టెంబర్‌ 22 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఆలయ మేనెజింగ్‌ ట్రస్టీలు, సభ్యులు, అర్చకులు, పెద్దలు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అందరూ ఈ ఉత్సవాలకు వచ్చి ఆచార్యులవారి కరుణ కటాక్షాలను పొందాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.