తిరుపతిలోని శ్రీ అహోబిలమఠంలో మూడురోజులపాటు అక్టోబర్ 17 నుంచి 19వ తేదీవరకు జరిగిన శ్రీ ఆదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశికుల వారి వార్షిక కేట్టై తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరిరోజున తిరువళ్ళూరు, తిరుపతి గోవిందరాజ స్వామి సన్నిధి, తిరుచానూరు పద్మావతి దేవాలయం నుంచి వచ్చిన మాలలను దివ్య ప్రబంధ, వేద పారాయణాల నడుమ శ్రీమత్ ఆదివణ్ శఠగోప యతీంద్రులవారికి సమర్పించారు. కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్ శిష్యులు దివ్య ప్రబంధ పారాయణ సేవలో పాల్గొన్నారు. వీరితోపాటు మఠం నిర్వాహకులు తదితరులు ఈ ఉత్సవాలు వైభవంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. పలువురు భక్తులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.