Paramparaa – The Tradition Continues…

కడాంబి శేషాచారి చెల్లస్వామి శతమాన మహోత్సవం

నెల్లూరులోని సంతానం బుక్స్‌ వ్యవస్థాపకలు, ఉభయ వేదాంత కడాంబి వేంకటాచారి (చెల్లస్వామి) (1923-2023) శతమాన మహోత్సవం వేడుకలను నెల్లూరులోని రంగనాయకులపేటలో గోపురం వీధిలో ఉన్న శాంత నివాస్‌లో వైభవంగా జరపనున్నారు. 2రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా మొదటిరోజు అనగా 20-02-2023, సోమవారం సాయంత్రం 5-00గంటలకు వేద దివ్య ప్రబంధ, ఇతిహాస, పురాణ పారాయణములు ప్రారంభించనున్నారు. మరుసటిరోజు అనగా తేది 21-12-2023 మంగళవారంనాడు ‘‘శతమాన మహోత్సవం’’ ‘‘సుదర్శన హోమం’’తో పాటు ‘‘శాత్తుమొర కార్యక్రమాలు జరుగుతుందని కడాంబి సంతానం సోదరులు తెలియజేశారు.