Paramparaa – The Tradition Continues…

క్రోధి సంవత్సర మహాలయ పక్షం 18-09-2023 to 03-10-2023

 

 మహాలయ పక్ష తర్పణ క్రమం ( పితృు పక్షం)  

మహాలయ పక్షం అనగా భాద్రపద కృష్ణ పక్ష ప్రథమ మొదలు కొని చతుర్దశి వరకు  ఉన్న రోజులను మహాలయ పక్షం అంటారు .  మన శ్రీ వైష్ణవ సంప్రదాయములో మహాలయ పక్షంలో ఒక రోజు మాత్రం తర్పణం చేయుట ఆచారముగా ఉన్నది. సాధారణముగా  ఈ తర్పణమును  మహాలయపక్షములో మహా భరణి, మద్యాష్టమి వ్యతి పాదము , లేక  గజచ్చాయ మొదలగు దినములలో చేయుట విశేషము. లేక వారివారి   మాతృ పితరుల తిధిలో చేయ వచ్చును.

గమనిక :  మన బంధువులలో , పుత్ర భాగ్యములేక మరణించిన వారికి , వారికి సంక్రమణ తర్పణం ( అమావాస్య)  లేదు . అటువంటి వారికి మహాలయ తర్పణమునందు వారి వారి గోత్రం పేర్లు బంధు వర్గం చెప్పి తర్పించ వలెను . లేని యెడల అందరికి కలిపి  కారుణ్య పితృు తర్పణం చేయుట విశేషము.   ఉll తండ్రి తరపున పెద్దనాన్న పెద్దమ్మ  తల్లి తరపున    అత్త,మేనమామ  లకు పుత్ర భాగ్యము లేనిచో వారికి తర్పించ వలసిన విధము   …. గోత్రస్య … శర్మణ : . మమ పితృవ్య పితు: …. స్వధానమస్తర్పయామి అని మూడు సార్లు తర్పించవలెను   …. గోత్రా యా : ….. నా  మ్ని  మమ పితృు వ్యా …. స్వధానమస్తర్పయామి అని మూడుసార్లు  తర్పించవలెను .    లేని చో అందరికి కలిపి  కారుణ్య పితృు  స్వధానమస్తర్ప యామి .  

1. కొందరు ఈ పక్షం రోజులు చేయుదురు దీనిని పక్ష మహాళయం అంటారు . 2. ముఖ్యమైన దినములలో  పుణ్యదిన మహాళయం అంటారు.  3. ఒక రోజు చేయట సకృున్ మహాళయం అంటారు

ముఖ్యమైన దినములు  

21.9 2024 శనివారం మహాభరణి  

24.09.24  బుధవారము మహావ్యతిపాదం 

 25.09.24 గురువారం మధ్యాష్టమి  

-Kambharajapuram Murali Iyengar, Tirupati

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour