నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో శ్రీమద్ ఆదివణ్ శఠగోప యతీర్రద స్వామికి, శ్రీ వేదాంత దేశికులవారికి ఘనంగా ఉత్సవాలను నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సెప్టెంబర్ 13 నుంచి 25వ తేదీ వరకు శ్రీమద్ ఆదివణ్ శఠగోప స్వామికి ఆస్థాన ఉత్సవాలు జరుగుతాయి. స్వామి దేశికులవారి 755వ అవతార తిరునక్షత్రములో భాగంగా శ్రీమాన్ నేలటూరు (కొలాయి) రంగస్వామి స్మారకార్థం వారి కుమారులు శ్రీమాన్ నేలటూరు నారాయణన్ వారు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి కిరీటాన్ని సమర్పించనున్నారు. ఈ ఉత్సవాలకు భక్తులంతా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఆలయ మేనెజింగ్ ట్రస్టీ శ్రీమాన్ కడాంబి వరదరాజన్ (జనా), ట్రస్టీలు శ్రీమాన్ నేలటూరు వంగీపురం బాలాజీ, శ్రీమాన్ కడాంబి రామదొరై, శ్రీమాన్ వరదరాజన్ రమేష్, శ్రీమాన్ బండేపల్లి రాజగోపాలన్ కోరుతున్నారు.

