Paramparaa – The Tradition Continues…

నెల్లూరులో హంస, సింహ వాహనంపై
కనువిందు చేసిన వేదాంత దేశికులు

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌ 26వ తేదీ సోమవారంనాడు శ్రీ వేదాంత దేశికులవారికి హంసవాహన ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్‌ కడాంబి సంపత్‌ గోపాలన్‌ వ్యవహరించారు. సెప్టెంబర్‌ 27వ తేదీ మంగళవారం సాయంత్రం సింహవాహనంపై శ్రీ దేశికులవారిని ఊరేగించారు. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్‌ కడాంబి క్రిష్ణస్వామి కుటుంబం వారు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో అర్చకులు విజయసారథి, భద్రిస్వామి, అధ్యాపకం గోష్టిలో కడాంబి రామానుజాచార్యులు, సుదర్శన్‌ స్వామి, చిమ్ముకుట్టి స్వామి తదితరులతోపాటు, ఆలయ ట్రస్టీలు వరదరాజన్‌, రామదొరై, రమేష్‌, బాలాజీ, రాజగోపాలన్‌ తదితరులు పాల్గొన్నారు.

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour