నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో శ్రీమద్ ఆదివణ్ శఠగోప యతీర్రద మహాదేశికన్ స్వామికి, ఆచార్య సార్వభౌమ తూప్పుల్ శ్రీ వేదాంత దేశికులవారికి ఘనంగా ఉత్సవాలను నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భక్తులంతా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఆలయ మేనెజింగ్ ట్రస్టీ శ్రీమాన్ కడాంబి వరదరాజన్ (జనా), ట్రస్టీలు శ్రీమాన్ నేలటూరు బాలాజీ, శ్రీమాన్ కడాంబి రామదొరై, శ్రీమాన్ వరదరాజన్ రమేష్, శ్రీమాన్ బండేపల్లి రాజగోపాలన్ ఒక ప్రకనలో కోరారు. లోక కళ్యాణార్థమై వేద దివ్య ప్రబందగోష్టితో భక్తజన నయనానందకరముగా ఈ ఉత్సవాలు జరుగుతాయని అందరూ ఇందులో పాల్గొని తీర్ధప్రసాదములు స్వీకరించి, భగవత్ భాగవత ఆచార్యుల కృపకు పాత్రులు కావలసినదిగా వారు కోరారు.
శ్రీమద్ ఆదివణ్ శఠగోప యతీర్రద మహాదేశికన్ స్వామికి, సెప్టెంబర్ 19 నుంచి 27 వరకు ఆస్థాన ఉత్సవములు జరుగుతాయి. సెప్టెంబర్ 23వ తేదీన శ్రీ వేదాంతదేశికులవారికి సింహవాహన సేవ జరుగుతుంది. 24వ తేదీన హంసవాహనం, 25వ తేదీన శ్రీ వేంకటేశ్వర స్వామివారికి గరుడవాహన సేవ, శ్రీ వేదాంత దేశికులవారికి, శ్రీమద్ ఆదివణ్ శఠగోపస్వామికి తిరుచ్చి ఉత్సవం జరుగుతుంది. 26వ తేదీన శ్రీ వేదాంత దేశికులవారికి యాళివాహన సేవ జరుగుతుంది. 27న ముత్తంగి అలంకారంతో తిరుచ్చి సేవ జరుగుతుంది. 28న పల్లకి సేవ, విశేష కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారికి శేషవాహనం, శ్రీ వేదాంత దేశికులవారికి తిరుచ్చి సేవ జరుగుతుంది. 29వ తేదీన శ్రీ దేశికులవారికి చంద్రప్రభ వాహన సేవ, 30వ తేదీన గజవాహన సేవ, 31వ తేదీన అశ్వవాహన సేవ జరుగుతుంది. అక్టోబర్ 2వ తేదీన శ్రీ మహాదేశికులవారికి స్నపన తిరుమంజనం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారికి శేషవాహనం, శ్రీ వేదాంత దేశికులవారికి తిరుచ్చి సేవ జరుగుతుంది. 3వ తేదీన గంధపొడి ఉత్సవం జరుగుతుంది.
