కీ.శే. బ్రహ్మశ్రీ మాచవోలు రామయ్య శాస్త్రి గారి 120 వ జయంతి వేడుక స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి శనివారం 4-10-2025న నెల్లూరు తుమ్మగుంట వారి వీధిలోని భాస్కర శర్మ ఇంటియందు ఘనంగా జరిగింది. ఈ వేడుకలను పురస్కరించుకుని నిత్య పూజ విశేష పూజ వేదపారాయణం ఇతర కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నెల్లూరు శ్రీ వేదాంతదేశికులవారి ట్రస్టీ వరదరాజన్‌గారు తదితరులు పాల్గొన్నారు.
