తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి ఆధ్వర్యములో
1050వ తిరుమల నంబి అవతార మహోత్సవములు తిరుమల దక్షిణ మాడవీధిలో ఉన్న తిరుమలనంబి ఆలయంలో ఘనంగా జరిగింది. తిరుమలనంబి వంశీయులు, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు అధికారులు, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం అధ్యాపకులు, ప్రముఖ పండితులు హాజరయ్యారు. పండితులు ఈ సందర్భంగా చేసిన ఉపన్యాసాలు అందరినీ అలరించాయి. సంస్కృత విద్యాపీఠం ప్రొఫెసర్ ఉ.వే. చక్రవర్తి రంగనాధన్, తిరుమల నంబి వంశీయులు శ్రీ కణ్ణన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పండితులు వివిధ అంశాలపై ఉపన్యాసాలు చేసి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా శ్రీ తిరుమలనంబి దివ్య చరితామృతము అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తక రచయిత పి వెంకటరామిరెడ్డి విజయవాడ వాస్తవ్యులు. వీరిచే ఈ భగవంతుడు అనుగ్రహము చేత వారు ఈ పుస్తకాన్ని రచించినట్లు తెలియజేశారు.










