తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి సన్నిధివీధిలో ఉన్న పరకాలమఠంలో ఏకదిన అధ్యయన ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దివ్య ప్రబంధ పారాయణం, వేద పారాయణం జరిగింది. పలువురు పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమలనంబి వంశీయులు ముకుందన్ గారు, కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్ శిష్యులు పలువురు ఈ ఉత్సవంలో పాల్గొని వేద, ప్రబంధ పారాయణం చేశారు. మఠం అరాధకులు శ్రీ గోవిందరాజన్ స్వామి ఈ వేడుకల విజయవంతానికి కావల్సిన ఏర్పాట్లను చేశారు. తిరుపతి ప్రముఖులు శ్రీ దేవరాజన్ ఇతరులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.
