తిరుమలలోని శ్రీ అహోబిలమఠంలో 46వ పీఠాధిపతులు శ్రీవణ్ శఠగోపశ్రీరంగనాధయతీంద్ర మహాదేశికుల స్వామివారి చేతుల మీదుగా శ్రీ వేదాంతదేశికస్తోత్రమాలికా పుస్తకావిష్కరణ జరిగింది.
ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అహోబిలమఠం శ్రీకార్యం స్వామి శ్రీ పద్మనాభచారియార్, మాజీ వైస్ ఛాన్సలర్ శ్రీ కే.ఇ. దేవనాధన్‌స్వామి, పండితులు శ్రీ విభీషణ శర్మ తదితరులు శ్రీ దేశికులవారి స్తోత్రవైభవాన్ని తమ ప్రసంగంలో వివరించారు. అహోబిలమఠం పీఠాధిపతి అనుగ్రహభాషణం చేస్తూ, దేశికులవారి స్తోత్రాలను చదవడం ద్వారా ఎన్నో ఉత్తమఫలితాలను పొందవచ్చని, ఈ పుస్తకాన్ని తీసుకోవడంతోపాటు పారాయణం చేయడం ముఖ్యమని చెప్పారు. ఈ పుస్తక సంకలనకర్త శ్రీ చక్రవర్తి రంగనాధన్ గారు మాట్లాడుతూ, శ్రీ వేదాంతదేశికులవారు అనుగ్రహించిన 28 దివ్యస్తోత్రములతోపాటు శ్రీ వేదాంతదేశికులవారు వివిధ దివ్యదేశాల్లో ఈ స్తోత్రాలను అనుగ్రహించినందువల్ల ఆయా దివ్యదేశాల వివరణ, ఫోటోలను కూడా ఇచ్చినట్లు తెలిపారు.
అహోబిలమఠం చైర్మన్ (ఎపి, తెలంగాణ ) శ్రీ నీలమేఘం గారు మాట్లాడుతూ, ఈ పుస్తకాన్ని వెలువరించడానికి సహాయపడిన మహేష్, శ్రీ చక్రవర్తి రంగనాధన్‌గారికి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు.






