Paramparaa – The Tradition Continues…

అచిరకాలంలోనే అత్యున్నతస్థాయికి ఎదిగిన నిరంజన్‌ శృంగవరపు

అమెరికాలో తెలుగువాళ్ళు ఇప్పుడు కీలకరంగాల్లో సత్తా చాటుతున్నారు. ఉద్యోగంకోసం అమెరికా వెళ్ళి, అక్కడే స్థిరపడి అత్యున్నతస్థాయికి ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో నిరంజన్‌ శృంగవరపు ఒకరు.      కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ పరిధిలోని రాజానగరంలో జన్మించిన నిరంజన్‌ శృంగవరపు నేడు అమెరికాలోని అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)కు వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. మరోవైపు ఉద్యోగంకోసం అమెరికా వచ్చిన నిరంజన్‌ శృంగవరపు నేడు రెండు మూడు ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసి ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తున్నారు. జన్మభూమిలో సేవలు చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధమేనంటూ తానా ఫౌండేషన్‌ చైర్మన్‌గా ఆయన లక్షలాదిమందికి ఫౌండేషన్‌ ద్వారా సహాయాన్ని అందించారు. తానా ఫౌండేషన్‌ చరిత్రలో ఇంతమందికి సహాయాన్ని అందించడం ఆయన హయాంలోనే జరిగింది.


స్వస్థలం నుంచి అమెరికా దాకా….

కర్నూలు జిల్లాకు చెందిన రైతు కుటుంబంలో నిరంజన్‌ శృంగవరపు జన్మించారు. ఆయన తండ్రి పేరు సుబ్రహ్మణ్యం శృంగవరపు, తల్లిపేరు ఇంద్రావతి శృంగవరపు.  ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కర్నూలు జిల్లాలోనే జరిగింది. ఉన్నత చదువులకోసం బళ్ళారిలోని ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరి కంప్యూటర్‌ సైన్స్‌ చదివారు. తరువాత హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ తల్లితండ్రులు, స్నేహితుల ప్రోత్సాహంతో అమెరికాకు 2001లో వచ్చాను. డిట్రాయిట్‌లోని బెంజ్‌ కార్‌ ఫ్యాక్టరీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం లభించింది. ఉద్యోగం చేస్తూ, తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సొంతంగా ఐటీ కంపెనీని ఏర్పాటు చేశారు. 2003లో ఐటీ సర్వీసెస్‌ బిజినెస్‌ను ప్రారంభించి కంపెనీని కూడా మల్టీమిలియన్‌ కంపెనీగా తీర్చిదిద్దారు. డిట్రాయిట్‌లోని నోవిలో  దీఱువషష్ట్ర Iఅష కంపెనీని ఏర్పాటు చేసి ప్రస్తుతం దానికి ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. న్యూజెర్సిలోని Rవaశ్రీూశీట్‌ Iఅష/ణఱఙవతీంఱ్‌వ ణఱతీవష్‌  కంపెనీకి సిఇఓగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు.  


 అమెరికాలో ఉంటూ వ్యాపార వ్యవహారాల్లో బిజీగా ఉన్నప్పటికీ సేవా కార్యక్రమాలను ఎన్నటికీ విస్మరించలేదు. చిన్ననాటి నుంచే అలవడిన సేవా గుణం వల్ల ఎంతోమందికి ఆయన సహాయపడుతూ వస్తున్నారు.  


సర్వేషా ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా…

 నిరుపేదల అభ్యున్నతికోసం ఏర్పాటు చేసిన సర్వేషా ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ వస్తున్నారు. రాజానగంలో దాదాపు ఉచిత కంటివైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతోపాటు దాదాపు 1000 మందికి పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచిత కంటి అద్దాలను, 500 మందికి ఆపరేషన్లను చేయించి మందులను అందించారు. రాజానగరంలోని రామాలయం దేవాలయం అభివృద్ధికోసం విరాళాన్ని ఇచ్చారు. ఖమ్మంలోని వైరా మండలం గొల్లెనపహాద్‌లో మంచినీటి ప్రాజెక్టు ఏర్పాటు, పేద విద్యార్థుల చదువుకు సహాయం చేయడంతోపాటు దాదాపు లక్ష రూపాయల స్కాలర్‌షిప్‌లను పంపిణీ చేశారు.


 తానా వైస్‌ప్రెసిడెంట్‌గా….

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి తానా ద్వారా సేవా కార్యక్రమాలను మరింత ముమ్మరంగా చేయవచ్చన్న తలంపుతో 2009లో తానాలో చేరిన ఆయన అనతికాలంలోనే సంఘంలో మంచి గుర్తింపును పేరును తెచ్చుకున్నారు. తానాలో ఎన్నో పదవులను నిర్వహించిన ఆయన తానా వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికకావడానికి ముందు తానా ఫౌండేషన్‌ చైర్మన్‌గా నిన్నటివరకు వ్యవహరించారు. కోవిడ్‌ సమయంలో  తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు తానా ఫౌండేషన్‌ తరపున సహాయాన్ని అందించారు. లక్షలాదిమందికి అన్నదానం, మాస్క్‌ల పంపిణీ, అనాథ శరణాలయాలకు, ఓల్డ్‌ ఏజ్‌హోమ్స్‌కు, ఇతర సేవా సంస్థలకు ఆయన సహాయాన్ని అందించారు. తానా ఫౌండేషన్‌ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు చేయూత కార్యక్రమం ద్వారా దాతల సహాయంతో స్కాలర్‌షిప్‌లను ఇచ్చారు. ఆదరణ పథకం కింద ట్రై సైకిళ్ళను పంపిణీ చేయించారు. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలను ఆయన చేశారు. ఎన్నో సంస్థలకు ఆయన సొంతంగా విరాళాలను ఇచ్చారు.


తెలుగు భాషకోసం…


తెలుగు భాషపై ఉన్న ప్రేమతో అమెరికాలోని చిన్నారులకు తెలుగు భాషను నేర్పించాలన్న తపనతో ‘పాఠశాల’ను తానా చేపట్టడంలో ఆయన ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం తానా పాఠశాల ద్వారా అమెరికాలోని వివిధ చోట్ల ఉన్న చిన్నారులకు తెలుగు భాషను నేర్పించేందుకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారు.
 అలాగే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న చిన్నారులకు లైబ్రరీలు లేకపోవడం వలన వారు తమ తరగతి పుస్తకాలకే పరిమితమైపోతున్నారు. లైబ్రరీ వసతి లేని ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి అక్కడ లైబ్రరీలను ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైన పుస్తకాలను, చిన్నారుల బుద్ధి వికాసానికి ఉపయోగపడే ఇతర పుస్తకాలను కూడా అందులో ఏర్పాటు చేసేందుకు ఆయన కృషి చేస్తున్నారు.


ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో…

అమెరికాలో ఉన్నా అన్నీ పండుగలను, వేడుకలను సంప్రదాయంగా నిర్వహించడంలో ఆయన ముందుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాల అభివృద్ధికి తనవంతుగా ఆయన సేవలందిస్తూ, సహాయపడుతున్నారు.

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour