Paramparaa – The Tradition Continues…

నెల్లూరులో ఘనంగా ఆదివన్‌ శఠగోపస్వామి తిరునక్షత్ర మహోత్సవం

అహోబిల మఠం వ్యవస్థాపకులు, పద కవితా పితామహుడు అన్నమాచార్య గురువుగారు అయిన శ్రీ ఆదివన్‌ శఠగోప స్వామి వారి 642 వ జన్మదిన తిరునక్షత్ర మహోత్సవాలు నెల్లూరు నగరంలోని వేదాంతదేశికర్‌ దేవస్థానంలో వైభవంగా జరిగాయి. తొలుత శ్రీ వేెంకటేశ్వర స్వామి వారికి, వేదాంత దేశికులు వారికి, ఆదివన్‌ శఠగోప స్వామి వారికి సుప్రభాత సేవ తరువాత పల్లకి మహోత్సవం జరిగింది. వేద పండితులచే తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం వెంకటేశ్వర స్వామి వారికి శేష వాహనం శఠగోపస్వామివారికి పల్లకిసేవ, ఆస్థానం, మంగళాశాసనం, శాత్తుమొర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు విజయ సారథి బట్టర్‌,ఆలయ మేనేజింగ్‌ ట్రస్ట్‌ కేసి వరదరాజన్‌, నేలటూరు బాలాజీ ,రమేష్‌, కిడాంబి నరసింహం, కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.