Paramparaa – The Tradition Continues…

నెల్లూరు ఉత్సవాలు…కనువిందు చేసిన గరుడ సేవ

నెల్లూరు నగరంలోని రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికులు దేవస్థానం ప్రాంగణంలో శ్రీ వేదాంత దేశికర్‌ ఆచార్యులు అహోబిల మఠం వ్యవస్థాపకులు ఆదివన్‌ శఠగోప స్వామి వార్ల ఆచార్య తిరునక్షత్ర ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆదివారం గరుడ వాహన సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంతానం కిదాంబి నరసింహాచార్యులు అట్టముక్కలతో స్వామివారికి పాదుకలు వేయటం తయారుచేసి స్వామివారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కేసీ వరదరాజన్‌, నేలటూరు బాలాజీ, రమేష్‌ ,విష్ణు, కళ్యాణ్‌, శ్రావణ్‌, ప్రధాన అర్చకులు విజయ సారధి బట్టర్‌ తదితరులు పాల్గొన్నారు.