Paramparaa – The Tradition Continues…

నెల్లూరు శ్రీ దేశికుల దేవాలయంలో ఘనంగా తిరువాడిపురం ఉత్సవం

శ్రీ ఆండాళ్‌ అమ్మవారి తిరువాడిపురం ఉత్సవం సందర్భంగా నెల్లూరులోని శ్రీ వేదాంత దేశిక స్వామి దేవాలయంలో సోమవారం ఆండాళ్‌ అమ్మవారిని అందంగా అలంకరించి ఉత్సవం నిర్వహించారు. పురాణాల ప్రకారం పాండ్య దేశంలో విష్ణుభక్తుడైన శ్రీ విష్ణుచిత్తుడికి చెందిన తులసీవనంలో భూదేవి అంశగా ఆండాళ్‌(గోదాదేవి) అమ్మవారు ఆవిర్భవించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది తిరువాడిపురం వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో పలువురు భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆండాళ్‌ అమ్మవారు అనుగ్రహించిన తిరుప్పావై, గోదాస్తుతి తదితర పాశురాలను పఠించారు.