నెల్లూరులోని రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంతదేశికులవారి ఆలయంలో తమిళ ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష తిరుమంజనం ఇతర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. శుభకృత్ నామ సంవత్సరం అందరికీ శుభాన్ని కలగజేయాలని ఈ సందర్భంగా స్వామివారిని వేడుకున్నట్లు ఆలయ మేనేజింగ్ ట్రస్టీ కేసి వరదరాజన్ తదితరులు తెలిపారు.
