దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని అమెరికాలో వివిధ నగరాల్లో వేడుకలను ఎన్నారైలు నిర్వహిస్తున్నారు. దేవాలయాల్లో నవరాత్రి ప్రత్యేక పూజలను చేస్తుంటే మరికొందరు తమ తమ ఇళ్ళల్లో బొమ్మల కొలువును ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలను చేస్తున్నారు. హ్యూస్టన్లో ఉంటున్న సతీష్ బుక్కపట్నం వారి ఇంట్లో నవరాత్రి వేడుకలను వైభవంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా అందరినీ ఆకట్టుకునేలా బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. ఈ బొమ్మలకొలువులో శ్రీ వేంకటేశ్వరస్వామి, మహావిష్ణువు, సుదర్శన పెరుమాళ్, దశావతారాలు, అష్టలక్ష్ములు, సీతా సమేత రామలక్ష్మణుల బొమ్మలు, దుర్గాదేవి, సరస్వతీదేవితోపాటు ఇతర బొమ్మలను ఏర్పాటు చేశారు. ఈ సందర పాటలు, గోష్టులను ఏర్పాటు చేశారు. సతీష్ సతీమణి పద్మప్రియ (ఉమ) నవరాత్రికి సంబంధించిన అన్నీ కార్యక్రమాలను చక్కగా నిర్వహించడంతోపాటు, బొమ్మలను అందంగా తీర్చిదిద్ది ఆకట్టుకునేలా కొలువును తయారు చేసింది. ఈ బొమ్మల వేడుకల్లో పాల్గొనడానికి, తిలకించడానికి వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలను, కోవిడ్ కారణంగా ప్రసాదాలను ప్యాకెట్లలో అందిస్తున్న సతీష్ దంపతులను పలువురు ప్రశంసిస్తూ, భారతీయ సంప్రదాయాన్ని అమెరికాలో కూడా చక్కగా పాటిస్తున్నారని అభినందించారు.