ధనుర్మాసాన్ని పురస్కరించుకుని నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికర్ దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను, ప్రవచనాలను నిర్వహిస్తున్నారు. ఈ ధనుర్మాస సేవల్లో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని, దేశికులవారిని దర్శించుకుని పలువురు భక్తులు తిరుప్పావై పారాయణం, ప్రవచన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
నెల్లూరు నగర రంగనాయకుల పేటలో వేంచేసియున్న వేదాంత దేశికులు దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుప్పావై ఉత్సవములు ఘనంగా జరుగుతున్నాయి. అలాగే తిరుప్పావై పాశురాలపై ప్రవచనాలను కూడా ఏర్పాటు చేశారు. నెల్లూరు నగరానికి చెందిన కిడాంబి రామధురై తిరుప్పావైలోని 19వ పాశురం వివరిస్తూ తిరుప్పావై ప్రవచనాలు భగవంతుడిపై ఉన్న భక్తిని గోపికలు ఎలా ప్రదర్శించారో తెలియజేస్తున్నాయని పేర్కొంటూ ఆండాళ్ అమ్మవారు 19 వ పాశురం లో చెప్పిన విధంగా శ్రీరంగనాధుని సేవించాలని పేర్కొన్నారు. ప్రధాన అర్చకులు బాలాజీ బట్టర్ మేనేజింగ్ ట్రస్టీ కిడాంబి వరదరాజన్ తదితరులు ఈ ధనుర్మాసోత్సవాల విజయవంతానికి కృషి చేస్తున్నారు.