Paramparaa – The Tradition Continues…

దేశిక విజయం

శ్రీ వేదాంత దేశికులు అన్నీరంగాల్లో ప్రావీణ్యం సంపాదించడమే కాకుండా, వైష్ణవ సిద్ధాంతాన్ని అన్నింటా అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేశారు. మానవులను సన్మార్గంలో పయనింపజేయడానికి అనేక శాస్త్రాలను, గ్రంథాలను, స్తోత్రాలను రాయడమే కాకుండా, వితండవాడంతో, అహంకారంతో అసూయాద్వేషాలతో విర్రవీగే పండితులను తన వాదపటిమతో ఓడిరచారు. భగవద్‌ రామానుజులు బోధించిన విశిష్టాద్వైతాన్ని మరింతగా విస్తరించేందుకు దేశికులవారు కృషి చేశారు.

అధ్యయనోత్సవం వివాదం
శ్రీరంగంలో సంప్రదాయం ప్రకారం నిర్వహించే అధ్యయనోత్సవాన్ని అద్వైత పండితులు అడ్డుకున్నారు. అక్కడ పండితులు వృద్ధులైనందువల్ల వారితో వాదోపవాదనకు దిగలేకపోయారు. అదే సమయంలో తిరువహీంద్రపురంలో నివసిస్తున్న శ్రీ వేదాంత దేశికులకు శ్రీరంగంలో ఉత్సవాన్ని అడ్డుకున్నారన్న వార్త తెలిసింది. శ్రీరంగం చేరుకుని అడ్డుకున్న పండితులతో వాదానికి దిగారు. చాలారోజులపాటు వాదోపవాదాలు సాగాయి. చివరకు ప్రత్యర్థులు తాము ఓడిపోయామంటూ అంగీకరించారు. తరువాత అర్చకస్వాములు, అక్కడ ఉన్న పండితులు, ఆలయ అధికారులు అందరూ కలిసి అధ్యయనోత్సవాన్ని వైభవంగా జరిపించారు. ఈ వాదాల సారాంశమే ‘శతదూషణి’ పేరుతో దేశికులచే ఆవిష్కృతమైంది.

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour