Paramparaa – The Tradition Continues…

వైభవంగా జరిగిన ఆదివణ్‌ శఠగోపస్వామి తిరునక్షత్ర మహోత్సవం

నెల్లూరు నగరం రంగనాయక పేటలో వేంచేసియున్న శ్రీ వేదాంత దేశికర్‌ దేవస్థానం నందు అన్నమాచార్యుల గురువులు అహోబిల మఠం వ్యవస్థాపకులు ఆదివణ్‌ శఠగోప స్వామివారి స్వామి 654 వర్ష తిరునక్షత్ర మహోత్సవములు శనివారం ఘనంగా జరిగాయి. ఉదయం ఆదివన్‌ శఠగోప స్వామివారికి పల్లకి గొడుగులు ఉత్సవం, శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లకు శ్రీ ఆదివన్‌ శఠగోప స్వామి, వేదాంత దేశిక స్వామివార్లకు స్నపన తిరుమంజనం సాయంత్రం శేష వాహనంపై పేట ఉత్సవం తదుపరి శాత్తుమొరై కార్యక్రమాలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు విజయ సారధి బట్టర్‌ ,విజయ రాఘవన్‌ బట్టర్‌ స్వాముల ఆధ్వర్యంలో ఆలయ మేనేజింగ్‌ ట్రస్ట్‌ కేసి వరదరాజన్‌, నేలటూరు బాలాజీ, కిడంబి రామదొరై, రమేష్‌ నడదూర్‌ కృష్ణమాచార్యులు పలువురు భక్తులు పాల్గొన్నారు.

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour