Paramparaa – The Tradition Continues…

దేశికుల వారి సన్నిధికి వేంచేసిన గోవిందరాజస్వామి

తిరుపతిలోని శ్రీ వేదాంత దేశికులవారి సన్నిధిలో జరుగుతున్న 755వ తిరునక్షత్రం వేడుకల్లో భాగంగా చివరిరోజున శ్రీ దేశికులవారి సన్నిధికి శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ గోవిందరాజస్వామి వేంచేశారు. ఈ సందర్భంగా గోవిందరాజస్వామివారి మాలలను దేశికులవారికి అలంకరించిన తరువాత హారతి గోష్టి జరిగింది. ఈ సందర్భంగా శ్రీమాన్‌ కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్‌ స్వామి శిష్యులు దివ్య ప్రబంధ సేవాకాలం, వేద శాత్తుమొరై జరిపారు. ఈ కార్యక్రమంలో టీటిడి అధికారులతోపాటు భక్తులు పాల్గొన్నారు.

ఘనంగా ముగిసిన ఆదివణ్‌ శఠగోప ఉత్సవాలు

తిరుపతిలోని శ్రీ అహోబిలమఠంలో మూడురోజులపాటు అక్టోబర్‌ 17 నుంచి 19వ తేదీవరకు జరిగిన శ్రీ ఆదివణ్‌ శఠగోప యతీంద్ర మహాదేశికుల వారి వార్షిక కేట్టై తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరిరోజున తిరువళ్ళూరు, తిరుపతి గోవిందరాజ స్వామి సన్నిధి, తిరుచానూరు పద్మావతి దేవాలయం నుంచి వచ్చిన మాలలను దివ్య ప్రబంధ, వేద పారాయణాల నడుమ శ్రీమత్‌ ఆదివణ్‌ శఠగోప యతీంద్రులవారికి సమర్పించారు. కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్‌ శిష్యులు దివ్య ప్రబంధ పారాయణ సేవలో పాల్గొన్నారు. వీరితోపాటు మఠం […]

ఘనంగా ఆదివణ్‌ శఠగోప యతీంద్ర మహాదేశికుల తిరునక్షత్ర ఉత్సవాలు

తిరుపతిలోని అహోబిలమఠంలో ఆదివణ్‌ శఠగోప యతీంద్ర మహాదేశికుల తిరునక్షత్ర ఉత్సవాల్లో భాగంగా 2వ రోజున దివ్య ప్రబంధపారాయణం, వేదపారాయణం వంటివి జరిగాయి. ఈ దివ్య ప్రబంధ సేవాకాలంలో శ్రీమాన్‌ కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్‌ శిష్యులు, ఇతరులు పాల్గొన్నారు. తరువాత శాత్తుమొరై, ప్రసాద వినియోగం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని శ్రీ లక్ష్మీనరసింహుని, శ్రీ ఆదివణ్‌ శఠగోప యతీంద్ర మహాదేశికులవారిని దర్శించుకున్నారు.

నెల్లూరులో ఘనంగా గోదాస్తుతి పుస్తకావిష్కరణ

శ్రీవైష్ణవ సంప్రదాయానికి, ముఖ్యంగా దేశిక సంప్రదాయ ప్రవచనానికి శ్రీ సేవా స్వామి చేస్తున్న సేవను వారి వంశీయులు సేవా ట్రస్ట్‌ ద్వారా కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా శ్రీ వేదాంత దేశికులవారు రచించిన శ్రీ గోదాస్తుతి పుస్తకాన్ని నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికులవారి దేవాలయంలో మార్చి 7వ తేదీన జరిగిన కార్యక్రమంలో వైభవంగా ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి సేవాస్వామి తెలుగువ్యాఖ్యానాన్ని అందించారు. ప్రముఖ పండితులు, తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ ఉ.వే. చక్రవర్తి రంగనాధన్‌గారు పుస్తకావిష్కరణ చేసి మాట్లాడారు. […]

చినజీయర్‌ స్వామికి పద్మభూషణ్‌

రిపబ్లిక్ డే సందర్భంగా పలు రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను ఈ అత్యున్నత పురస్కారాలకు కేంద్రం ఎంపిక చేసింది.   తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక విభాగంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్‌ స్వామి; కమలేశ్‌ డి పటేల్‌ పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. అలాగే, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణిని పద్మశ్రీ వరించింది.   ఈ ఏడాదికి గాను మొత్తంగా 106 పద్మ పురస్కాలు ప్రకటించిన కేంద్రం  వీటిలో ఆరుగురిని పద్మవిభూషణ్‌, తొమ్మిది మందిని పద్మభూషణ్‌, 91మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక […]

న్యూయార్క్‌లో ఘనంగా ఆదివణ్‌ శఠగోపస్వామి తిరునక్షత్ర మహోత్సవం

అహోబిల మఠం వ్యవస్థాపకులు, అహోబిలమఠం తొలి పీఠాధిపతి శ్రీ ఆదివణ్‌ శఠగోప స్వామివారి తిరునక్షత్ర మహోత్సవము న్యూయార్క్‌లోని పొమానాలో ఉన్న శ్రీ రంగనాధస్వామి దేవాలయంలో అక్టోబర్‌ 1వ తేదీన వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేదం, దివ్య ప్రబంధ పారాయణం జరిగింది. శ్రీ రంగనాథస్వామి తిరుమంజనం, శ్రీ ఆదివణ్‌ శఠగోప స్వామివారికి మర్యాదై వంటి కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. శ్రీ కృష్ణ దేశిక జీయర్‌ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, ఆలయ నిర్వాహకులు […]